Jaya Krishna: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు స్టార్ హీరోగా ఎదిగాడు. కృష్ణ పెద్దకొడుకు అయిన రమేష్ బాబు అనుకున్న మాదిరిగా సక్సెస్ లను సాధించలేకపోయాడు. ఇక రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న క్రమంలో ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమా భారీ విజయాన్ని సాధించాలని ఘట్టమనేని అభిమానులందరూ కోరుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన జయ కృష్ణ మహేష్ బాబు గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. వాళ్ల నాన్న రమేష్ బాబు చనిపోయినప్పుడు తను చిన్న పిల్లాడినని మా నాన్న మరణం మా అందరి కంటే మహేష్ బాబు బాబాయ్ ని బాగా కలిచివేసిందని ఆ సమయంలో ఆయన చాలా వరకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని చెప్పాడు. ఇక ఆ తర్వాత మా తాతగారు చనిపోవడం, ఆ వెంటనే మా నాన్నమ్మ మరణించడం మహేష్ బాబు ను తీవ్రంగా కలిసి వేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక మాకు మా నాన్న లేడు కాబట్టి నెక్స్ట్ ఎలా మూవ్ అవ్వాలి, మనం ఎలా ముందుకు సాగాలి అనే విషయంలో అమ్మతోపాటు చాలా వరకు చర్చించానని అయినా కూడా మేము ఎలా ముందుకెళ్లాలో అర్థం కాలేదని చెప్పాడు.
సరిగ్గా అప్పుడే మహేష్ బాబు బాబాయ్ మాకు చాలా వరకు సపోర్టుగా నిలిచి ఏం చేయాలి ఎలా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనే విషయంలో నాకు సలహాలు సూచనలు ఇస్తూ మా గైడెన్స్ మొత్తాన్ని తనే చూసుకున్నాడని జయ కృష్ణ చెప్పాడు. నిజానికి మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు, నాన్న కృష్ణ, అమ్మ ఇందిరా దేవి చాలా తక్కువ వ్యవధి లోనే చనిపోయారు.
ముగ్గురు మరణాలను చూసిన మహేష్ బాబు ఒకసారి ఒక ఈవెంట్ లో స్టేజ్ మీదనే ఎమోషనల్ అయిపోయాడు. నిజానికి వాళ్ళ అందరి వల్లే మహేష్ బాబు స్టార్ హీరోగా మారాడు. ఇక రమేష్ బాబు, మహేష్ బాబు ఇద్దరు కూడా చిన్నతనంలో చాలా మంచి క్లోజ్ గా ఉండే వాళ్ళు…వీరిద్దరి మధ్య 12 సంవత్సరాల గ్యాప్ ఉండడంతో షూటింగ్ కి వెళ్ళిన ప్రతిసారి రమేష్ బాబు మహేష్ బాబు ఫాదర్ గా తన బాధ్యతలను చూసుకునేవాడని గతంలో మహేష్ బాబు పలు సందర్భాల్లో చెప్పాడు. ప్రస్తుతం జయకృష్ణ కూడా అదే విషయాన్ని గుర్తు చేసుకోవడం విశేషం…
ఇక మొత్తానికైతే శ్రీనివాస మంగాపురం సినిమాకి మహేష్ బాబు చాలావరకు సపోర్ట్ గా నిలబడి ఆ సినిమా షూటింగ్ కి గానీ, సినిమా రిలీజ్ చేయడానికి గాని ఆయన మాకు చాలా సపోర్ట్ చేశాడంటూ జయకృష్ణ చెప్పడం అందరినీ ఆకట్టుకుంటుంది. ఎలాగైనా సరే ఈ సినిమాతో సక్సెస్ ని సాధించి నాకు సపోర్ట్ చేసిన బాబాయికి గొప్ప పేరు తీసుకొస్తానంటూ ఆయన చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేశాడు…