Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత గ్రాండ్ గా జరిగాయో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మహేష్ బాబు పుట్టినరోజు కి సంబంధించిన సంబరాల వీడియోలే కనిపిస్తున్నాయి. నిన్నటితో ఆయనకు 51 వ సంవత్సరం లోకి అడుగుపెట్టాడు. ఇంత వయస్సు వచ్చినా మహేష్ బాబు ఇంత మెరిసిపోయే అందం తో ఎలా ఉంటాడు?, ఆయన అనుసరించే డైట్ ఏంటి?, పాతిక కుర్రాళ్లకు బట్ట తల , బానపొట్ట వచ్చేస్తున్న రోజులు ఇవి. నెత్తి మీద జుట్టు ఉన్నప్పటికీ, అంత చిన్న వయస్సులోనే నరిసిపోతున్నాయి. ఇలాంటి రోజుల్లో 51 ఏళ్ళు వచ్చినా పాతికేళ్ల కుర్రాడిలాగా మహేష్ కనిపించడానికి కారణం ఏంటి? అనేది అభిమానులకు కూడా తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంటుంది. అయితే గతం లో పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో తన డైట్ లో అసలు ముట్టుకోని ఆహార పదార్థాల గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘పెరుగు అనేది అసలు ముట్టుకోను, బర్గర్ , బ్రెడ్ వంటివి అసలు తినను, పిజ్జా ని అయితే దగ్గరకు కూడా రానివ్వను. ఈ మూడు నా డైట్ లో అసలు ఉండదు’ అంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. ఇవి తినడం మానేసి దాదాపుగా 18 ఏళ్ళు అయ్యిందని , ఆకలి తో ఉన్నప్పుడు నా ముందు అవి కనిపించినా కూడా అవి తినను అంటూ మహేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఎప్పుడైనా పిల్లలతో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళు బలవంతం చేస్తే సరదాగా తిని ఉండచ్చేమో కానీ, సాధ్యమైనంత వరకు వాటికి దూరం గా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. దీనిని బట్టీ మహేష్ బాబు అసలు జంక్ ఫుడ్ ని ప్రోత్సహించడు అనేది తెలుస్తోంది.
అదే ఆయన గ్లామర్ రహస్యం అయ్యుండొచ్చు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ‘వారణాసి’ మూవీ విషయానికి వస్తే , శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , అప్పుడే 80 శాతం పూర్తి అయ్యిందట. అక్టోబర్ లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి , వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో అన్ని భాషల్లోనూ విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. ఎక్కువగా VFX ఆధారిత సినిమా కావడంతో, పోస్ట్ ప్రొడక్షన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడట రాజమౌళి. నిన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేస్తారేమో అని అభిమానులు ఆశపడ్డారు , కానీ కేవలం సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని మాత్రమే విడుదల చేయడం తో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.