HomeతెలంగాణPreethi Reddy Dance: మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి మాస్ డ్యాన్స్.. పాలిటిక్స్ లోకి వచ్చేసినట్టేనా..

Preethi Reddy Dance: మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి మాస్ డ్యాన్స్.. పాలిటిక్స్ లోకి వచ్చేసినట్టేనా..

Preethi Reddy Dance: ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం మాట్లాడినా సరే సంచలనంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆయన చేసే కామెంట్లు.. వేసే డ్యాన్సులు.. ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉంటాయి. మల్లారెడ్డి మాత్రమే కాదు.. ఇప్పుడు ఆయన కోడలు కూడా మామ చూపించిన దారిలోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. మల్లారెడ్డికి ఇద్దరు కుమారులు. అందులో భద్రారెడ్డి సతీమణి ప్రీతి రెడ్డి. ఈమె మల్లారెడ్డి విద్యాసంస్థలను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈమెకు సోషల్ […]

Preethi Reddy Dance: ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం మాట్లాడినా సరే సంచలనంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆయన చేసే కామెంట్లు.. వేసే డ్యాన్సులు.. ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉంటాయి. మల్లారెడ్డి మాత్రమే కాదు.. ఇప్పుడు ఆయన కోడలు కూడా మామ చూపించిన దారిలోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది.

మల్లారెడ్డికి ఇద్దరు కుమారులు. అందులో భద్రారెడ్డి సతీమణి ప్రీతి రెడ్డి. ఈమె మల్లారెడ్డి విద్యాసంస్థలను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈమెకు సోషల్ మీడియాలో యాక్టివా ఉండడం చాలా ఇష్టం. సోషల్ కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు. మల్లారెడ్డి తరహాలోనే కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈమె మాట్లాడే మాటలు.. చేసే డ్యాన్సులు ఆసక్తికరంగా ఉంటాయి. అప్పట్లో ఈమె తన మామతో కలిసి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. అప్పట్లోనే ప్రీతి రెడ్డి బిజెపిలో చేరుతుందని వార్తలు వచ్చాయి.

సరిగ్గా గత ఏడాది బోనాల వేడుకలు జరిగినప్పుడు బిజెపి ఎంపీ.. కేంద్రమంత్రి బండి సంజయ్ తో కలిసి ఆమె కార్యకర్త ఇంటికి వెళ్లారు. అక్కడ భోజనం కూడా చేశారు. ఈమె పేరు మీద అక్కడి బిజెపి కార్యకర్తలు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రీతి రెడ్డి బిజెపిలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. అయితే దీనిని ఆమె ఖండించలేదు. అలాగని స్వాగతించలేదు.

ప్రీతి రెడ్డి నిత్యం మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. సోషల్ ఆక్టివిటీ గాని.. ధార్మిక కార్యక్రమాలు గాని.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు గాని.. కాలేజీకి సంబంధించిన కార్యక్రమాలు గాని. ఇలా అన్నిట్లో ఆమె పాలుపంచుకుంటూనే ఉంటారు. ఆమె డ్యాన్సులు బాగా చేస్తారు. ఆమధ్య తమ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో మల్లారెడ్డి కోడలు డ్యాన్స్ చేశారు.. సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉండడంతో.. ఈమె చుట్టూ మీడియా తిరుగుతూ ఉంటుంది. మల్లారెడ్డికి ఉన్నట్టుగానే.. ప్రీతి రెడ్డి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. తాజాగా హైదరాబాదులో జరిగిన బోనాల వేడుకలో ప్రీతి రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాదు నెత్తికి తలపాగ చుట్టి.. బంగారు ఆభరణాలు ధరించి.. అమ్మవారి పాటలకు లయబద్ధంగా డ్యాన్సులు వేశారు. సోషల్ మీడియాలో మరోసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. మరోసారి తన పాపులారిటీని నిరూపించుకున్నారు. ప్రీతి రెడ్డి డ్యాన్సులు, మాటలు చూస్తుంటే త్వరలోనే పాలిటిక్స్ లోకి వస్తారని చర్చ నడుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper