Media Owner: అది హైదరాబాద్ నగరం.. అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతం. అందులోనూ అపోలో హాస్పిటల్ కి అత్యంత దగ్గర. అక్కడ గజం ధర దాదాపు 6 లక్షల వరకు పలుకుతోంది. అటువంటిచోట ఏడంతస్తుల మేడ నిర్మాణమైంది. చుట్టూ అద్దాలు.. అంతకుమించిన సౌకర్యాలు..
ఆ భవనం ఎవరిదని ఆరా తీస్తే.. సీనియర్ జర్నలిస్ట్ కం మీడియా అధినేతది అని తేలింది. గతంలో ఆ ప్రాంతంలో కొండలు ఉండేవి. ఆ కొండలను కరిగించి.. గుట్టలను తొలచి వేసి.. చెట్లను కొట్టి వేసి ఆ నిర్మాణం చేపట్టారు. మొత్తంగా ఏడ అంతస్తులలో ఇంద్ర భవనాన్ని మించిపోయే విధంగా నిర్మించారు. తద్వారా తన పత్రిక.. తన ఛానల్ అందులోనే నిర్వహించే అవకాశాన్ని ఆ మీడియా అధినేత సొంతం చేసుకున్నారు.
ఆ మీడియా అధినేతకు జర్నలిస్ట్ కాలనీలో 5 అంతస్తుల భవనం ఉంది. అందులో పత్రిక నిర్వహించేవారు. ఓ ఆసుపత్రి వెనుక ఉన్న అపార్ట్మెంట్లో చానల్ నిర్వహించేవారు. ఎప్పటినుంచో ఆయన ఈ భవనాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే కసరత్తు మొదలుపెట్టారు. మధ్యలో అనుకూలమైన ప్రభుత్వాలు రాకపోవడంతో ఆయనకు కాస్త ఇబ్బంది ఏర్పడింది. ముక్కుసూటితనం.. కాస్త ఆగ్రహం ఉండే ఆ జర్నలిస్ట్.. కం మీడియా ఓనర్.. అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చేవరకు ఎదురుచూశారు. చివరికి ఆరోజు రానే వచ్చింది. మొత్తంగా స్థలం కొనుక్కున్నారు. కొండలను పిండి చేశారు. గుట్టలను తొలగించారు. చివరికి తనకలను సాకారం చేసుకున్నారు. ఓ అంచనా ప్రకారం ఈ భవనం మొత్తం నిర్మాణ ఖర్చు వందల కోట్లు దాటిందట. ఈ భవనంలో కింది మూడు అంతస్తులలో పత్రిక.. పై మూడు అంతస్తుల లో ఛానల్ నిర్వహించబోతున్నారు. అత్యాధునిక స్టూడియో కూడా నిర్మించారు. ఇప్పటికే చాలా చానల్స్ కు హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు ఈ ఛానల్ కూడా చేరిపోయింది.
మొదట్లో అద్దె భవనాలలో ఈ ఛానల్ నిర్వహణ కొనసాగింది. ఇప్పుడు ఏకంగా ఏడంతస్తుల భవనంలోకి మారిపోతుంది. మీడియా అనేది నష్టాలతో కూడుకున్న వ్యవహారం అని.. నష్టాలు మాత్రమే వస్తాయని.. అందులో లాభాలు కొన్ని సంస్థలకు మాత్రమే లభిస్తాయని ఇప్పటివరకు ఒక ప్రచారం ఉండేది. కానీ ఈ మీడియా అధినేత నిర్మించిన భవనాన్ని చూసిన తర్వాత.. అదంతా అబద్ధమని.. మీడియా ముందు పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించడమే అసలైన లక్ష్యమని ఈ ఉదంతం ద్వారా తెలుస్తోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత.. మొత్తానికి ఆ మీడియా ఓనర్ కార్పొరేట్ అధిపతి అయ్యారు. కాకపోతే తన పత్రికలో కార్పొరేట్ ప్రపంచానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుంటారు. ఇక్కడ అదే అసలైన పిటి..