Mahesh Babu: సాయి సూర్య డెవలపర్స్(Sai Surya Developers), సురానా గ్రూప్స్ (Surana Groups) కి సంబంధించిన మనీ లాండరింగ్(Money Laundering) కేసు రాష్ట్రంలో ఎలాంటి ప్రకంపనలు రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సూర్య డెవలపర్స్ కి మహేష్ బాబు(Super Star Mahesh Babu) గతం లో పలు యాడ్స్ వీడియోస్ లో నటించాడు. అందుకు గాను ఆయన దాదాపుగా 6 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. అందులో సగం డబ్బులు మనీ లాండరింగ్ ద్వారా వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే విచారణకు రావాలంటూ మహేష్ బాబు కి నోటీసులు జారీ చేశారు. గత నెల 27,28 తేదీలలో మహేష్ బాబు విచారణకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ లో బిజీ ఉన్నందున రాలేకపోతున్నానని, వేరే ఏదైనా తేదీని ఫిక్స్ చేయమని అడిగాడట మహేష్. దీంతో ఈడీ అధికారులు నేడు విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మరి మహేష్ బాబు విచారణకు వస్తాడో లేదో చూడాలి.
Also Read: పనిచేయని బీసీసీఐ బుజ్జగింపులు.. టెస్టులపై విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
నేడు ఆయన విచారణకు వెళ్ళబోతున్నట్టు సమాచారం అయితే ఉంది కానీ, ఇంకా హాజరు అయ్యాడా లేదా అనే విషయం మాత్రం తెలియదు. ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో మహేష్ బాబు వివాదాలకు చాలా దూరంగా ఉంటూ వచ్చేవాడు. కానీ ఒక్కసారిగా ఇలాంటి కేసు లో చిక్కుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఈరోజు మహేష్ బాబు విచారణకు హాజరు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా గొడవ ఇక్కడితో సర్దుకుంటుంది. అలా కాకుండా నేడు కూడా ఆయన విచారణకు హాజరు కాకపోతే ఈడీ అధికారులు ఆయన పై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యి వారం రోజులైంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య ఒక పాటని ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు.
ఈ షెడ్యూల్ పూర్తి అవ్వగానే మహేష్ బాబు 40 రోజుల పాటు సమ్మర్ హాలిడేస్ ని తీసుకున్నాడు. రాజమౌళి కూడా విదేశీ పర్యటనలో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ హైదరాబాద్ లోనే ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఆయన కచ్చితంగా ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాసేపట్లో ఆయన వస్తాడా లేదా అనే సస్పెన్స్ కి తెరపడనుంది. ఇక రాజమౌళి తో ఆయన చేస్తున్న సినిమా విషయాలకు వస్తే మొదటి షెడ్యూల్ ని ఒడిశాలో పది రోజుల పాటు షూట్ చూసారు. అంతకు ముందే రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని కీలక సన్నివేశాలను గుట్టు చప్పుడు కాకుండా తీసారట. ఇక ఆ తర్వాత రెండవ షెడ్యూల్ భారీ యాక్షన్ సన్నివేశం కోసం హైదరాబాద్ లో భారీ సెట్స్ ని ఏర్పాటు చేశారు కానీ, ఆ షెడ్యూల్ కంటే ముందు ఒక పాటని చిత్రీకరించారు. ఆగష్టు 9 న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి కచ్చితంగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.