Ramayana vs Varanasi: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి రన్బీర్ కపూర్ ను మెయిన్ లీడ్ లో పెట్టి చేస్తున్న రామాయణం సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ ని గత కొద్దిసేపటికి రిలీజ్ చేశారు. మొత్తానికైతే ఈ సినిమాతో నితీష్ తివారి మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా నుంచి ఇంతకుముందు వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉందంటూ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి వార్ నడుస్తుంది. వీటిలో ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది. ఏ సినిమా డీలా పడిపోతుందనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రామాయణం సినిమా ట్రైలర్ తో తన సత్తా ఏంటో రుచి చూపించింది.
ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్లో నిలిచింది. కాబట్టి ఇప్పుడు వారణాసి సినిమాకి ఇది ఒక పెద్ద సవాలుగా మారనుంది. జక్కన్న తొందరలోనే వారణాసి సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ టీజర్ కి సంబంధించిన అన్ని పనులను చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు రామాయణం సినిమా ట్రైలర్ వచ్చింది కాబట్టి వారణాసి సినిమా టీజర్ సైతం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి.
లేకపోతే మాత్రం రామాయణం ముందు వారణాసి తేలిపోతుందనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచుతుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ప్రస్తుతానికైతే రణ్బీర్ కపూర్ అభిమానులు మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం రెండు సినిమాల మీద ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. ఏ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాలను క్రియేట్ చేస్తుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…