Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు… ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఏర్పడుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు… ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయనకి హాలీవుడ్ లో మార్కెట్ ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటినుంచి మహేష్ బాబుతో సినిమా చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఇంటి ముందు రోజు చాలామంది ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఒక ప్రొడ్యూసర్ అయితే మహేష్ బాబుకి బ్లాంక్ చెక్ ఇచ్చారట. దానిమీద నీకు ఇష్టం ఉన్నన్ని కోట్లు రాసుకోమని కూడా చెప్పారట. దానికి మహేష్ బాబు సైతం పెద్దగా స్పందించలేదట. ఇక మొత్తానికైతే వారణాసి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు తను నెక్స్ట్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు ఏంటి అనే విషయాలను కూడా ఎక్కడ చెప్పడం లేదు.
ఎవరికి కమిట్మెంట్స్ ఇవ్వడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే వారణాసి సినిమా మీదనే ఆయన పూర్తి కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. అలాగే ఆ సినిమా రిలీజ్ అయితే గాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ రాదని చెబుతున్నారట…
ఇంతకీ తనకి బ్లాంక్ చెక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎవరు అంటే కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కాంతారా, కేజీఎఫ్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హోం బలే పిక్చర్స్ వారు అంటూ ప్రచారం జరుగుతుంది… వాళ్లతో ఆయన సినిమా చేసే అవకాశం ఉందా? లేదంటే మరో ప్రొడ్యూసర్ తో సినిమా చేస్తాడా? అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…