Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక మహేష్ బాబు కి జోడిగా మొదటిసారి ప్రియాంక చోప్రా నటిస్తుండటం విశేషం… వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ రికార్డులను తిరగరాస్తూ పెను సంచలనాలను క్రియేట్ చేయడం పక్కా అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ల కామెంట్లను వ్యక్తం చేస్తుండటం విశేషం… ఇక వారణాసి సినిమా వరల్డ్ ను పరిచయం చేస్తూ రాజమౌళి ఇంతకుముందు రిలీజ్ చేసిన ఒక గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అయితే ఈ సినిమా నుంచి తొందరలోనే టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా తన భర్త అయిన నిక్ జోనస్ తో కలిసి మహేష్ బాబుతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి ‘వారణాసి’ సినిమా షూటింగ్లో భాగంగా ప్రియాంక చోప్రా హైదరాబాద్లోనూ నివాసముంటుంది. ఇక ఈ కారణంగా వాళ్ళు రీసెంట్ గా మహేష్ బాబు ప్రస్టేజియస్ గా కట్టుకున్న ఏఎంబి సినిమాస్ లో సందడి చేశారు.ఈ విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు సైతం ఏఎంబి మాల్ లో కనిపించడం విశేషం…
ప్రియాంక చోప్రా దంపతులు ఇద్దరు ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ది ఒడిస్సీ సినిమాని చూడడానికి ఏఎంబి సినిమాస్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది. స్వయంగా మహేష్ బాబు వాళ్లకు ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సినిమాని చూడడమే కాకుండా వాళ్లు ముగ్గురు కలిసి దిగిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…
మొత్తానికైతే నటీనటులు సినిమా షూటింగ్లో కలుసుకోవడమే కాదు ఖాళీ సమయాల్లో బయట పర్సనల్గా కూడా కలిసి వాళ్ల ఫ్రెండ్షిప్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే మహేష్ బాబుకి తన భర్తను పరిచయం చేసిన ప్రియాంక చోప్రా కాసేపు సరదాగా మాటాడుకున్నారు.
ఇక వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన వారణాసి సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తున్నారు. తొందరలోనే ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేసి అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో జక్కన్న ఉన్నట్టుగా తెలుస్తుంది…