Beavers: ఆర్కిటెక్టర్లు, ఇంజనీర్ల ప్లానింగ్ ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గొప్ప నిర్మాణాలు సాధ్యమయ్యాయి. ఆనకట్టల నుంచి మొదలుపెడితే ఆకాశాన్ని తాకే భవనాల వరకు వారి వల్లే నిర్మాణం అవుతున్నాయి. అందుకే ఇంజనీర్లను ఆధునిక ప్రపంచ నిర్మాతలు అని పిలుస్తుంటారు. సాధారణంగా ఒక నిర్మాణంలో ఇంజనీర్ గాని ఆర్కిటెక్టర్ గాని విపరీతంగా కష్టపడుతుంటారు. తమ మేధస్సుకు పదును పెడుతుంటారు. నేల స్వభావం.. వాడాల్సిన ఇసుక.. ఉపయోగించాల్సిన కంకర.. ఇనుము.. సిమెంటు ఇలా ప్రతి విభాగంలోనూ లెక్కలేసుకుంటారు. అందువల్లే గొప్ప గొప్ప నిర్మాణాలు సాధ్యమవుతుంటాయి. ఈ సందర్భాల్లో ఇవి కూలిపోతుంటాయి కూడా. అయినప్పటికీ మెజారిటీ నిర్మాణాలు ఇప్పటికీ బలంగా, దృఢంగా కనిపిస్తూనే ఉంటాయి. మనదేశంలో బహుళార్థక సాధక నిర్మాణాలుగా పేరొందినవన్నీ ఇంజనీర్ల నిర్మాణ కౌశలం వల్ల సాధ్యమైనవంటే అతిశయోక్తి కాదు. అయితే ఆధునిక నిర్మాణాలలో ఇంజనీర్లు.. ఆర్కిటెక్టర్లు ఎంతగా కష్టపడుతున్నారు.. ఆనకట్టలు కట్టే విషయంలోనూ ఎలుకలు అంతే విధంగా కష్టపడుతున్నాయి. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది తెలుసుకోవాల్సిన కథ.
Also Read: పనిచేయని బీసీసీఐ బుజ్జగింపులు.. టెస్టులపై విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
ఆనకట్టలు కడుతున్నాయి
ప్రవహించే నీటికి వేగం ఎక్కువగా ఉంటుంది. దానికి అడ్డుకట్ట వేయాలంటే ఎంతో కష్టపడాలి. దాని మార్గాన్ని వేరే విధంగా మళ్లించి.. అక్కడ ఒక నిర్మాణం చేపట్టి.. ఆ తర్వాత నీటి ప్రవాహాన్ని కొనసాగించాలి. అయితే ఇంతటి ప్రక్రియ చేపట్టాలంటే చాలా ప్రయాస పడాల్సి ఉంటుంది. ఇలాంటిదేమీ లేకుండా ఒక జాతీ ఎలుకలు పారే నీటిలో ఏకంగా ఆనకట్టలు నిర్మిస్తున్నాయి. చదువుతుంటే నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం.. శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది.. అమెరికా, యురేషియా ప్రాంతాలలో బీవర్లు అనే ఎలుకలు నివసిస్తుంటాయి. ఇది పారే కాలువలు.. సెలయేర్లకు అడ్డంగా దుంగలను వేస్తుంటాయి. ఇవి తమ బలమైన దంతాలతో ఎంతటి పెద్ద వృక్షాన్నయినా సరే కొరికి పడేస్తాయి. ఆ తర్వాత వాటిని నీటి ప్రవాహం వైపుకు వెళ్లేలా చేస్తాయి. అవి ఆగడానికి రాళ్లను.. మట్టిని పోగుచేస్తాయి. వాటిని ఒక దగ్గరికి తీసుకొస్తాయి. ఆ తర్వాత వాటిపై పుల్లలు.. గడ్డి వంటి పదార్థాలు వేస్తూ ఆనకట్టలుగా నిర్మిస్తుంటాయి. ఆ తర్వాత వాటిపై అవి నివాసం ఉంటాయి. అందులో దుర్భేద్యమైన ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి బీవర్ అనే ఎలుకలు ఇలాంటి నిర్మాణాలు నిర్మిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాస్తవానికి ఈ ఎలుకలు అత్యంత చిన్నవిగా ఉంటాయి. అయినప్పటికీ అవి చేసే పనులు మాత్రం అతిపెద్దగా ఉంటాయి. ఈ ఎలుకలు గింజలను, పండ్లను ఆహారంగా తీసుకుంటాయి. బొరియలలో నివాసం ఉంటాయి. ఏడాదికి సరిపడే ఆహారాన్ని ఒకేసారి సంపాదించుకుంటాయి. ఆ తర్వాత ఆహారాన్ని అత్యంత భద్రంగా కాపాడుకుంటాయి.. ఆహారాన్ని నిల్వ చేసుకున్నప్పటికీ.. అవి ఇష్టానుసారంగా తినవు. కేవలం కడుపులో పట్టేంత మాత్రమే తింటాయి. మితమైన ఆహారానికి ప్రతీకగా బీవర్ ఎలుకలు నిలుస్తాయి.