August 2026 Holidays: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు, ఉద్యోగులకు గుడ్ న్యూస్. పండుగల సీజన్ ప్రారంభం కానుండడంతో పాటు ప్రత్యేక పర్వదినాలు ఉన్నందున ఆగస్టు నెలలో వరుస సెలవులు రానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులకు ఈ సెలవులు వర్తించే అవకాశం ఉవంది. ప్రతి వారంలో దాదాపు రెండు నుంచి మూడు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. దీంతో చాలామంది కుటుంబంతో కలిసి విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనలు, స్వగ్రామాలకు వెళ్లేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ నెలలో సెలవులు ఎలా ఉన్నాయంటే?
తెలంగాణలో ఆగస్టు 8న రెండో శనివారం, 9న ఆదివారం, ఆగస్టు 10న బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండటంతో వరుసగా మూడు రోజుల సెలవులు ఉండనున్నాయి. హైదరాబాద్‌తో పాటు బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగే ప్రాంతాల్లో ఈ సెలవులకు మరింత ప్రాధాన్యం ఉంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు మూడు రోజుల విరామాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు ఉంటుంది. మరుసటి రోజు ఆగస్టు 16 ఆదివారం కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా రెండు రోజుల సెలవులు లభించనున్నాయి. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 21న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 25న మంగళవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కూడా పబ్లిక్ హాలిడే ప్రకటించారు. ఈ రెండు పండుగల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి.
ఆగస్టు 26న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు 28న రక్షాబంధన్‌కు ఆప్షనల్ హాలిడే కల్పించారు. ఉద్యోగులు తమ శాఖ నిబంధనల ప్రకారం ఈ ఐచ్ఛిక సెలవును వినియోగించుకోవచ్చు.
ఆగస్టులో వరుస సెలవులు రావడంతో రైళ్లు, బస్సులు, విమానాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుమల, యాదాద్రి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, వేములవాడ, బాసర వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశముంది. అలాగే పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరగనుంది.