Prabhas Mahesh Babu : ఎంత ఎదిగినా ఒదిగి ఉండే క్వాలిటీ , మన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో చాలా తక్కువమందిలో చూస్తుంటాం, అలాంటి తక్కుమంది సూపర్ స్టార్స్ లో ఒకరు రెబల్ స్టార్ ప్రభాస్. తన తోటి స్టార్ హీరోల పట్ల ఎలాంటి అభద్రతా భావం ఉండదు. సాధ్యమైనంత వరకు అందరి సినిమాలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రమోట్ చేస్తుంటాడు ప్రభాస్. ఇలాంటి హీరోలు ఇండియా లో ఉండడం చాలా అరుదు అనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి ప్రభాస్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అబ్బాయి ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘శ్రీనివాస మంగపురం’ రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్టోరీ ని అప్లోడ్ చేశాడు.
ఆయన మాట్లాడుతూ ‘తెలుగు సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేయబోతున్నందుకు రషా టాండన్ కి శుభాకాంక్షలు మరియు ఆల్ ది బెస్ట్. అదే విధంగా జయ కృష్ణ కి చాలా గొప్ప భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ అజయ్ భూపతి కి , నిర్మాత అశ్విని దత్ గారికి మరియు మూవీ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్. రేపు విడుదల అవ్వబోతున్న ‘శ్రీనివాస మంగపురం ‘ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ‘ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రభాస్ తో మొదటి నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం తో మంచి సాన్నిహిత్యం ఉంది. అదే విధంగా నిర్మాత అశ్వినీ దత్ తో ఆయన కల్కి వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని చేశారు , త్వరలోనే ‘కల్కి 2’ షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారు.
అంతే కాకుండా ఈ చిత్రం లో మోహన్ బాబు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు తో ప్రభాస్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘బుజ్జిగాడు’ చిత్రం నుండి వీళ్లిద్దరి రిలేషన్ కొనసాగుతూ వస్తోంది. మోహన్ బాబు ఒక్క మాట అడగగానే, ఆయన కొడుకు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ‘కన్నప్ప’ లో ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా కీలక పాత్ర పోషించారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభాస్ పెట్టిన ఈ స్టోరీ లో ఎక్కడా కూడా మోహన్ బాబు ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ప్రభాస్ ఈ స్టోరీ పెట్టడం తో మహేష్ బాబు అభిమానులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు.