Amulya Gowda : ఈమధ్య కాలం లో ఇన్ స్టాగ్రామ్ లో సినిమా హీరోయిన్స్ కంటే ఎక్కువగా టీవీ సీరియల్స్ హీరోయిన్స్ బాగా ఫేమస్ ఐపోతున్నారు. ఎక్కడ చూసినా వీళ్ళ మేనియా నే కనిపిస్తోంది. ఈమధ్య కాలం లో విష్ణు ప్రియ పేరు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. ఆమె లాగానే ఎంతో మంది టీవీ ఆర్టిస్ట్స్ హాట్ ఫోటోలు , వీడియోలను అప్లోడ్ చేస్తూ బాగా వైరల్ అవుతున్నారు. అలాంటి హీరోయిన్స్ జాబితాలో లేటెస్ట్ గా అమూల్య కూడా చేరిపోయింది. ఈమె స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘గుండెనిండా గుడి గంటలు’ అనే సీరియల్ లో మీనా అనే క్యారెక్టర్ ద్వారా ఎంత క్రేజ్ ని సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మీనా – బాలు జంటకు ఫ్యామిలీ ఆడియన్స్ లోనే కాదు , జెన్ జీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.
కేవలం టీవీ షోస్ తోనే కాకుండా, సోషల్ మీడియా ద్వారా కూడా ఈమె జెన్ జీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఈమె అందానికి వాళ్లంతా ఫిదా. రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ కంటే ఈమె చాలా అందం గా ఉంటుంది. అయితే రీసెంట్ గానే ఈమె తన కాబోయే భర్త ని అందరికీ పరిచయం చేసింది. అతని పేరు నిరంజన్. ఈయన కూడా టీవీ సీరియల్స్ లో పెద్ద హీరో. వీళ్లిద్దరు కలిసి ఇన్ స్టాగ్రామ్ లో అనేక వీడియోస్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి సముద్రం లో షికార్లు చేశారు. అందాలను ఆరబోసిన అమూల్య ని చూసి నెటిజెన్స్ మెంటలెక్కిపోతున్నారు. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
అమూల్య కన్నడ ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయి. అక్కడ హీరోయిన్ గా పలు సీరియల్స్ చేసింది , అంతే కాకుండా బిగ్ బాస్ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నది. అయితే అప్పట్లో ఆమెకు అంతగా ఫేమ్ లేకపోవడం తో ఫైనల్స్ వరకు రాలేకపోయింది. కానీ ఇప్పుడు అమూల్య అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. తెలుగు బిగ్ బాస్ సరికొత్త సీజన్ లోకి అడుగుపెడితే మాత్రం ఆమె టైటిల్ విన్నింగ్ రేస్ లోకి వెళ్లొచ్చు. కానీ ‘గుండెనిండా గుడి గంటలు’ సీరియల్ షూటింగ్ లో బిజీ గా ఉంది. స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న సీరియల్ ఇది. కాబట్టి ఈమెని బిగ్ బాస్ 10 లో చూడడం కష్టమే.