Homeజాతీయ వార్తలుLovely professional University: తెలుగు విద్యార్థులు చదివే యూనివర్సిటీలో బీభత్సకాండ.. ఇంతకీ ఏం జరిగింది.. వైరల్...

Lovely professional University: తెలుగు విద్యార్థులు చదివే యూనివర్సిటీలో బీభత్సకాండ.. ఇంతకీ ఏం జరిగింది.. వైరల్ వీడియోలు

Lovely professional University: అది అతిపెద్ద యూనివర్సిటీ. పైగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు దానిని నిర్వహిస్తున్నారు.. ఈ యూనివర్సిటీలో వినూత్నమైన కోర్స్ లు ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ కంప్యూటర్ కోర్సులు వినూత్నంగా ఉంటాయని.. ఇక్కడ చదివితే బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు గ్యారెంటీ అని తెలుగు విద్యార్థులు నమ్ముతుంటారు. అందువల్లే ఇక్కడ భారీ సంఖ్యలో తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. భారీగా తెలుగు విద్యార్థులు చదువుతున్న ఆ యూనివర్సిటీ పేరు […]

Lovely professional University: అది అతిపెద్ద యూనివర్సిటీ. పైగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు దానిని నిర్వహిస్తున్నారు.. ఈ యూనివర్సిటీలో వినూత్నమైన కోర్స్ లు ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ కంప్యూటర్ కోర్సులు వినూత్నంగా ఉంటాయని.. ఇక్కడ చదివితే బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు గ్యారెంటీ అని తెలుగు విద్యార్థులు నమ్ముతుంటారు. అందువల్లే ఇక్కడ భారీ సంఖ్యలో తెలుగు విద్యార్థులు చదువుతున్నారు.

భారీగా తెలుగు విద్యార్థులు చదువుతున్న ఆ యూనివర్సిటీ పేరు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఇది పంజాబ్ రాష్ట్రంలోని ఫగ్వారా అనే ప్రాంతంలో ఉంది. ఈ యూనివర్సిటీలో ఆదివారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక విద్యార్థి మీద దారుణం జరిగిందని.. ఆమె బలవంతంగా చనిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఆందోళనకు దిగారు. అయితే ఈ ఆరోపణలు అప్పటి వరకు అధికారికంగా నిర్ధారణకు గురికాలేదని పోలీసులు చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే ఆదివారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆ తర్వాత జాతీయ రహదారి పైకి వచ్చారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పట్ల విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగాలని కోరారు.

ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో క్యాంపస్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులు క్యాంపస్లో కిటికీలను.. ఇతర వస్తువులను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఇటుకలను.. పూల కుండీలలో వారు పగలగొట్టారు. వస్తువులకు నిప్పు పెట్టారు. విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో జలంధర్.. పగ్వారా నేషనల్ హైవే మీద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విద్యార్థులు ఆందోళనకు కారణమైన ఘటన అధికారికంగా నిర్ధారించలేదని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరిగిన వ్యాప్తి చెందిన సమాచారమే ఆందోళనకు కారణమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థుల నుంచి వచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన కంటే ముందు ఒకరోజు చిత్కారా యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఇదే స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ రెండు గంటల కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రాథమికంగా ఈ రెండు సంఘటనలకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు ప్రకటించారు.

కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం విద్యార్థుల్లో ఈ స్థాయిలో ఆందోళనకు కారణమైంది. వాస్తవానికి అది నిజమా? అబద్ధమా? అని నిర్ధారించుకుంటే బాగుండేది. అలాకాకుండా విద్యార్థులు బీభత్సకాండ కు దిగడంతో పరిస్థితి ఇంతకు దిగజారింది. అయితే ఇప్పుడు యూనివర్సిటీలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అక్కడ మీడియాలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది. క్రమశిక్షణకు పెట్టింది పేరైన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇలాంటి దారుణం జరగడానికి విద్యార్థుల తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shobhit kumar (@shobhitkumar007)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper