Madhuri Rathod: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి పేర్లు ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇద్దరూ ఒకే రూమ్ లో ఉన్నప్పుడు ఈశ్వర్ సాయి సతీమణి వచ్చి వీళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని , అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా, అవి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఎక్కడ చూసినా వాటి గురించే చర్చ. ఇన్ స్టాగ్రామ్ లో వేల కొద్దీ మీమ్స్ కూడా వచ్చాయి. వాటికి లక్షల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వచ్చేవి. అలా సెన్సేషన్ క్రియేట్ అయ్యాక మాధురి రాథోడ్ రీసెంట్ గా నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఈశ్వర్ సాయి పై ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఈశ్వర్ సాయి కూడా పరారీ లో ఉన్నాడట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే మాధురి రాథోడ్ కంప్లైంట్ పేర్కొన్న స్టేట్మెంట్ ఏంటంటే ‘నన్ను ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఇతన్ని నమ్మి నేను సర్వస్వం ఇచ్చేశాను. కానీ అతను నన్ను మోసం చేశాడు. నన్ను శారీరంగా వాడుకొని వదిలేసాడు’ అంటూ కంప్లైంట్ లో పేర్కొంది. ఈ కేసుని స్వీకరించి కంప్లైంట్ ని నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కానీ ఈశ్వర్ సాయి పరారీ లో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు రెండు బృందాలు గా ఏర్పడి ఈశ్వర్ సాయి కోసం గాలిస్తున్నాయి. మరి అతను దొరుకుతాడో లేదో చూడాలి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈశ్వర్ సాయి రీసెంట్ గానే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే మాధురి ఫిర్యాదు ప్రకారం చూస్తే అతను చెప్పింది మొత్తం అబద్దాలే అనేది స్పష్టమైంది.
ఇంతకీ ఈశ్వర్ సాయి చెప్పింది ఏంటంటే ‘మాధురి తో ఎమోషనల్ రిలేషన్ షిప్ పెట్టుకున్నది నిజమే, కానీ ఆరోజు మేము రూమ్ లో కలిసి లేము, నాకు ఆరోజు ఉదయాన్నే షూటింగ్ ఉన్నింది, నా వాష్ రూమ్ ఖాళీ లేకపోయేసరికి మాధురి వాష్ రూమ్ ని వాడుకున్నాను. అంతకు మించి అక్కడేమి జరగలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ మాధురి మాత్రం నన్ను శరీరంగా వాడుకున్నాడు అనే నిజాన్ని చెప్పుకొచ్చింది. పెళ్లి అయ్యాక ఈమెతో సంబంధం పెట్టుకోవడం తప్పు ఈశ్వర్ సాయి తప్పు కాగా, పెళ్ళైన వ్యక్తితో ఇలాంటి సంబంధం పెట్టుకోవడం మాధురి చేసిన తప్పు కూడా. అరెస్ట్ చేస్తే ఇద్దరినీ చేయాలి, ఈశ్వర్ సాయి ని ఒక్కడినే చేయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.