Homeఎంటర్టైన్మెంట్Nandamuri Balakrishna: బాలయ్య పై సెటైర్లు వేసిన తమిళ హీరో కార్తీ..

Nandamuri Balakrishna: బాలయ్య పై సెటైర్లు వేసిన తమిళ హీరో కార్తీ..

Nandamuri Balakrishna: తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ చిత్రం ‘సర్దార్ 2’ ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మిత్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఎందుకంటే ఇది 2022 వ సంవత్సరం లో విడుదలైన సూపర్ హిట్ ‘సర్దార్’ కి సీక్వెల్ కాబట్టి. తెలుగు లో కూడా ఈ చిత్రానికి అప్పట్లో […]

Nandamuri Balakrishna: తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ చిత్రం ‘సర్దార్ 2’ ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మిత్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఎందుకంటే ఇది 2022 వ సంవత్సరం లో విడుదలైన సూపర్ హిట్ ‘సర్దార్’ కి సీక్వెల్ కాబట్టి. తెలుగు లో కూడా ఈ చిత్రానికి అప్పట్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మంచి సందేశాత్మక చిత్రం అనే పేరు కూడా వచ్చింది. అలాంటి సినిమాకు సీక్వెల్ కాబట్టే, ఈ చిత్రం కోసం ఒకపక్క తెలుగు ఆడియన్స్ , మరో పక్క తమిళ ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని కూడా రీసెంట్ గానే గ్రాండ్ గా మొదలు పెట్టారు.

తెలుగు వెర్షన్ ప్రొమోషన్స్ లో భాగంగా నిన్న హీరో కార్తీ, ఎస్జే.సూర్య ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ లాంచ్ లో కూడా కనిపించారు. అంతే కాకుండా ప్రముఖ హీరో మంచు మనోజ్ తో కలిసి వీళ్లిద్దరు ఒక ఫన్నీ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఈ ఇంటర్వ్యూ లో కార్తీ మనోజ్ తో సరదాగా మాట్లాడుతూ ‘యాంకర్ అంటే ఎలా ఉండాలి అసలు, చూడండి ఎలా వచ్చాడో’ అని అంటాడు. అందుకు మనోజ్ ‘ఇప్పుడు నేను బాలయ్య తో కలిసి ఒక సినిమా చేస్తున్నాను’ అని అంటాడు. అప్పుడు కార్తీ ‘ఆయన ట్రైన్, నువ్వు లారీ.. ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో మరి’ అని అంటాడు. అప్పుడు మనోజ్ ‘నేను లారీ విసిరితే, ఆయన ట్రైన్ విసురుతాడు’ అంటూ కామెంట్ చేస్తాడు. అలా చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది ఈ ఇంటర్వ్యూ. అయితే దీనిపై కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ మాత్రం, మా బాలయ్య మీదనే ఫన్ చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొంతమంది అభిమానులు మాత్రం ఫన్నీ గా తీసుకున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్స్ గా మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ నటించారు. మొదటి భాగం లో కార్తీ కి జోడిగా రాశీ ఖన్నా నటించింది. ఇప్పుడు ఆమె స్థానం లోకి ఆశికా రంగనాథ్ ని తీసుకున్నారా ?, లేదంటే వేరే ఏదైనా పాత్ర కోసం ఆమెని ఎంపిక చేశారా అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా మొదటి భాగాన్ని అక్కినేని నాగార్జున తెలుగు లో ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేసాడు. రెండవ భాగాన్ని కూడా అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేయబోతుంది. మరి ఈసారి కూడా అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Vanara Cinema (@vanaracinema)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper