The Paradise: కేటీఆర్ భుజాల మీద వేసుకొని ది ప్యారడైజ్ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. నైజాం ప్రాంతంలో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. వసూళ్ల విషయంలో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది. ఆయనప్పటికీ ఉత్తరాంధ్ర.. సీడెడ్ ప్రాంతంలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి.. ఒక రకంగా అక్కడ నెగిటివ్ స్పెక్యులేషన్ ఎక్కువగా జరుగుతోంది. అయినప్పటికీ అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఈ సినిమా ఈ స్థాయి దాకా రావడం అంటే మామూలు విషయం కాదు.
ది ప్యారడైజ్ సినిమాను కేటీఆర్ నిన్న ఆర్టీసీ ఎక్స్ రోడ్లో చూశారు. ఆ తర్వాత సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో సినిమాకు పాజిటివ్ బజ్ మరింత ఏర్పడింది. దీనికి తోడు శని, ఆదివారాల్లో బుక్ మై షో లో వేలకు వేలు టికెట్లు అమ్ముడుపోవడంతో సినిమా యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. దీనికి తోడు శనివారం సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో నాని.. శ్రీకాంత్.. మోహన్ బాబు వంటి వారు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియదర్శి ఇచ్చిన స్పీచ్ వేరే లెవెల్. ఇక సంపూర్ణేష్ బాబు కూడా చాలా రోజుల తర్వాత తన మనసులో ఉన్న భావాలను మొత్తం బయటపెట్టాడు.
ఈ సినిమాకు అంత బాగుంటుంది అనుకుంటున్న క్రమంలో.. ఊహించని షాక్ తగిలింది. ఒక రకంగా ఇది నానికి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ది ప్యారడైజ్ సినిమాకు సంబంధించి ఆన్లైన్ సైట్లలో హెచ్ డీ ప్రింట్లు కనిపిస్తున్నాయి. కేవలం విడుదలైన నాలుగు రోజులకే ఈ సినిమాకు సంబంధించి ప్రింట్లు పైరసీ సైట్లలో కనిపించడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది వాటి స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జోరు కలెక్షన్లు ఉండగానే పైరసీ సైట్లలో సినిమా కనిపించడం పట్ల మూవీ యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 114 కోట్ల వసూళ్లు సాధించింది.
ఈ సినిమాను గులాబీ పార్టీ నాయకులు భుజాల మీద వేసుకున్నారు. ఇందులో శంకర్రావు పాత్రలో కెసిఆర్ ను పోల్చి చూసుకుంటున్నారు. ప్రియదర్శి కూడా అదే విషయాన్ని సక్సెస్ మీట్ లో చెప్పాడు. ఆ పాత్ర వెనుక ఉన్న కష్టాన్ని అతడు వివరించాడు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. శంకర్రావు కనిపించిన ఆ కొన్ని నిమిషాల పాత్ర మరొక ఎత్తు. అందువల్లే సోషల్ మీడియాలో శంకర్రావు పాత్ర గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. కొంతమంది పాజిటివ్గా.. మరికొంతమంది నెగిటివ్గా కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా విషయంలో చర్చ ఆగడం లేదు. అయితే పైరసీలో ఈ సినిమా కనిపించిన నేపథ్యంలో.. చిత్ర యూనిట్ ఎటువంటి అడుగులు వేస్తుందనేది చూడాల్సి ఉంది. చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పుడు పోలీసులు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
–> నాని ‘ది ప్యారడైజ్’కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన సినిమా
–> విడుదలైన రెండు రోజులకే పైరసీ సైట్లలో సినిమా కనిపించిందంటూ పోస్టులు
–> ఆన్లైన్ లీక్పై సోషల్ మీడియాలో చర్చ
–> కలెక్షన్ల జోరులో ఉండగానే పైరసీ షాక్తో మూవీ యూనిట్ టెన్షన్
–> ఇప్పటికే రూ.114 కోట్ల… pic.twitter.com/tUHXqhHKR3
— RTV (@RTVnewsnetwork) September 27, 2026