Carrot History : మనం వంటింట్లో రోజు చూసే క్యారెట్ కలర్ సాధారణంగా ఆరెంజ్ లో ఉంటుంది. కానీ ఈ క్యారెట్ ఒకప్పుడు ఉదా (పర్పుల్) రంగులో ఉండేది అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అయితే కాలక్రమేనా ఈ రంగు మారి ఆరెంజ్ లోకి మారింది. అసలు క్యారెట్ ఇలా మారడానికి కారణం ఏంటి? క్యారెట్ కు ఉన్న చరిత్ర ఏంటి?
చారిత్రక ఆధారాల ప్రకారం 12 నుంచి 15వ శతాబ్దాల మధ్య యూరప్ లో క్యారెట్ పర్పుల్, పసుపు రంగులో ఉండేవి. అయితే 16వ శతాబ్దం నాటికి పసుపు రంగులో ఉన్న క్యారెట్లు ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత పశ్చిమ యూరప్ లో ఆరెంజ్ రంగు క్యారెట్లు అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా 17వ శతాబ్దంలో నెదర్లాండ్స్లో ఆరెంజ్ క్యారెట్లను పెంచడంలో డచ్ రైతులు ప్రముఖ పాత్ర పోషించారు. అయితే ఉదా రంగులో ఉన్న క్యారెట్ ఆరెంజ్ రంగు లోకి మారడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది.
నెదర్లాండ్స్ లోని హౌస్ ఆఫ్ ఆరెంజ్ నసావు రాజ వంశానికి గౌరవంగా ఈ ఆరెంజ్ క్యారెట్లను మార్చినట్లు తెలుస్తోంది. ఆరెంజ్ కలర్ ఈ రాజ కుటుంబానికి ఎక్కువగా అనుబంధం ఉండటంతో ఈ కలర్ లోకి మార్చి పండించినట్లు చరిత్ర తెలుపుతోంది. అయితే ప్రస్తుతం క్యారెట్ పర్పుల్, పసుపు మాత్రమే కాకుండా ఆరెంజ్, వైట్, బ్లాక్ కలర్ లో కూడా ఉన్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి.
అలాగే పుచ్చకాయ కూడా ప్రత్యేక చరిత్రను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 500 సంవత్సరాల కిందట ఈ పంటకు సంబంధించిన విత్తనాలు ఉత్తర ఆఫ్రికాలో కనిపించాయి. ప్రాచీన పుచ్చకాయలు లేత తెలుపు లేదా ఆకుపచ్చటి తెలుపు రంగులో గట్టిగా ఉండేవి. అంతేకాకుండా ఇవి తీపి కంటే ఎక్కువగా చేదును కలిగి ఉండేవి. అయితే కాలక్రమంలో రైతులు పెద్ద పండ్లు, మెత్తటి గుజ్జు, తక్కువ చేదు ధనం వచ్చేలా విత్తనాలను తయారు చేసి సాగు చేశారు ఈ విధమైన పుచ్చకాయ ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం దక్షిణ ఇజ్రాయిల్ లో పసుపు-ఆరెంజ్ కు సంబంధించిన పుచ్చకాయను కనుగొన్నట్లు తెలుస్తోంది. తర్వాత వీటి రంగుతో పాటు రుచి కూడా మారింది.
అయితే ఈ పంటల రూపాన్ని సాగు చేసిన రైతులే మార్చినట్లు తెలుస్తోంది. తమ అవసరాలకు అనుగుణంగా వాటిలో పరిశోధనలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.