Vijaya Sai Reddy: ఒరిజినల్ రెడ్ల పౌరుషమని ఇటీవల అనేక సందర్భాలలో ప్రకటించారు విజయసాయిరెడ్డి. వైసీపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా వదిలిపెట్టడం లేదు. ఆ పార్టీ అధికారం ఉన్నప్పుడు చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తనమీద దాడి చేశారని ఇటీవల చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. అక్కడితోనే ఆయన ఆగిపోవడం లేదు.
గతంలోని తాను మీడియా సంస్థను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు విజయసాయిరెడ్డి. మీడియా వ్యవహారాలను తన కూతురు చూసుకుంటుందని ప్రకటించారు. పేపర్.. న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. దానికి తగ్గట్టుగానే ఆయన ఒక పేపర్ తీసుకున్నారని తెలుస్తోంది. దాని పేరు వాయిస్ అని సమాచారం. ఈ పేపర్ కు వెబ్సైట్ కూడా ఉంది. ఈ ప్రకారం చూసుకుంటే వార్తలకు ఏమాత్రం అందులో కొదవలేదు. వాస్తవానికి ఇది పిడిఎఫ్ రూపంలోనే కనిపిస్తోంది. ఆయనప్పటికీ వైసీపీ అనుకూల మీడియా.. వైసిపికి అనుకూలంగా పనిచేసే కొన్ని సోషల్ మీడియా గ్రూపులు విజయసాయిరెడ్డి పేపర్ మీద విషం చిమ్మడం మొదలుపెట్టాయి. ఒకరకంగా ఆదిలోనే విజయసాయిరెడ్డి పత్రికకు కార్మకాండ చేయాలని నిర్ణయించుకున్నాయి. అందువల్లే నెగటివ్ ప్రాపకాండ మొదలుపెట్టాయి.
వాస్తవానికి విజయసాయిరెడ్డి తన పత్రిక.. తన ఛానల్ తన పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయదని ముందుగానే చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు వైసిపి ఎందుకు భయపడుతోంది.. వైసిపి ఎందుకు నెగిటివ్ ప్రచారం చేస్తోంది.. విజయసాయి రెడ్డికి గట్టిగా చెప్పుకుంటే నెల్లూరు జిల్లాలో తప్ప మిగతా రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. ఒక రకంగా ఆయన ప్రజాక్షేత్రంలో తిరిగిన రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఎప్పుడు వైసిపికి తెరవెనుకనే ఉండేవారు. జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చేవారు. ఆయన బయటికి వచ్చి పార్టీ పెట్టుకుంటానంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు.. వారి సోషల్ మీడియా గ్రూపుల్లో.. మీడియా గ్రూపుల్లో ఎందుకు వ్యతిరేకంగా చర్చలు సాగిస్తున్నారు.. విజన్ పేపర్ కు కాషాయం రంగు అద్దితే.. బిజెపికి భజన అంటూ ఎందుకు అంటున్నారు.. చివరికి తనను తాను బాల్ థాకరే లాగా అభివర్ణించుకుంటే వైసిపి నేతలకు ఎందుకు ఇబ్బంది.. మొత్తంగా చూస్తే దాల్ మే కుచ్ కాలా హై అనే సామెత కనిపిస్తోందని టిడిపి నేతలు అంటున్నారు.. మరి వైసీపీ నేతలు ఈ స్థాయిలో విషం చిమ్ముతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇటీవల వరుసగా నిర్వహించిన విలేకరుల సమావేశాలలో విజయసాయి రెడ్డి వైసీపీ నాయకత్వం పై మత మార్పిడుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.