Pakistan Viral Video: పాకిస్తాన్‌లో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని సీసీటీవీ ఫుటేజీలు సినిమా సీన్‌లు లేదా ఏఐ క్రియేషన్స్ కావు. అవి వాస్తవ ఘటనలను వెలుగులోకి తెస్తున్నాయి. ఈ దశ్యాల్లో తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వ్యక్తులపై దాడులు పాకిస్తాన్‌ను భయపెడుతున్నారు. ముఖ్యంగా 2008 ముంబై దాడులకు సూత్రధారిగా పేర్కొనబడిన జకీఉర్‌రెహమాన్ లక్వీకి సమీప బంధువు ఖఫీ/హాఫిజ్ జుల్ఫికర్ తీవ్రవాదులకు ఆర్థిక సహాయం, రిక్రూట్‌మెంట్‌లో సహకరించాడు. ఇతడిపై జరిగిన ఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అజ్ఞాత వ్యక్తుల చేతిలో ఇలాంటి ఘటనలు పాకిస్తాన్‌లో తీవ్రవాద వర్గాల్లో భయాన్ని సష్టిస్తున్నాయని చర్చలు జరుగుతున్నాయి.
ఫుటేజీలు వైరల్..
ఈ దశ్యాలు సీసీటీవీల్లో నమోదైనవని, ఏఐ లేదా కల్పితం కాదని కొందరు వాదిస్తున్నారు. అయితే పాకిస్తాన్ అధికారుల నుంచి అధికారిక నిర్ధారణ లేదు. ప్రధాన మీడియా సంస్థలు కూడా బాధితుడి గుర్తింపు, సంబంధాలు, కారణాలపై స్వతంత్రను ధ్రువీకరించలేదు. ఈ వీడియోలో జకీఉర్‌రెహమాన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతడి బంధువు జుల్ఫికర్ వెనక నుంచి వచ్చి సమీపం నుంచి తలపై గన్ గురిపెట్టాడు. రెప్ప పాటులు కాల్చి పడేశాడు. దీంతో జకీ ఉర్ రెహమాన్ అక్కడే కుప్పకూలాడు. ఇలాంటి ఘటనలు ఒక్కసారి కాకుండా వరుసగా జరుగుతున్నాయని, తీవ్రవాద నెట్‌వర్క్‌ల్లోనే చర్చనీయాంశమవుతున్నాయి.
తీవ్రవాద చరిత్రతో సంబంధం
2008 ముంబై దాడులు భారత్‌పై జరిగిన అత్యంత భయంకరమైన తీవ్రవాద చర్యల్లో ఒకటి. లక్వీని ఆ దాడుల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా భారత, అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. అతని సన్నిహితులు, సహాయకులపై జరుగుతున్న ఇలాంటి ఘటనలు గత చరిత్రను గుర్తు చేస్తున్నాయి. తీవ్రవాద సంస్థలకు ఆర్థిక మద్దతు, లాజిస్టిక్స్, రిక్రూట్‌మెంట్ అందించిన వ్యక్తులపై దృష్టి సారించడం ఈ వరుస ఘటనల్లో కనిపిస్తోంది. ఇది తీవ్రవాద నెట్‌వర్క్‌లను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘అజ్ఞాత’ దాడులు..
పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో అజ్ఞాత వ్యక్తుల చేతిలో తీవ్రవాదులు, వారి సహాయకులు లక్ష్యంగా మారుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. కొన్ని తీవ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులే ఇలాంటి నష్టాలను అంగీకరిస్తూ, బయటి శక్తులను ఆరోపిస్తున్నారు. ఇది ఆ నెట్‌వర్క్‌ల్లో అంతర్గత భయాన్ని పెంచుతోంది. సురక్షితంగా ఉన్నట్లు భావించిన ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు జరగడం వల్ల కార్యకలాపాలు, రిక్రూట్‌మెంట్‌పై ప్రభావం పడుతుందని అంచనా. ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఉండవచ్చు.
భద్రతపై భయం..
ఇలాంటి ఘటనలు భారత్–పాకిస్తాన్ సంబంధాలు, తీవ్రవాద వ్యతిరేక చర్యల చర్చలో భాగమవుతున్నాయి. పాకిస్తాన్ తన భూభాగంలో తీవ్రవాదాన్ని నియంత్రించాలన్న అంతర్జాతీయ ఒత్తిళ్లు కొనసాగుతుండగా, ఈ ‘అజ్ఞాత’ ఘటనలు మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తీవ్రవాదం ఎవరి చేతిలోనైనా హింసను పెంచుతుంది, సాధారణ ప్రజల భద్రతను దెబ్బతీస్తుంది. ఈ వరుస సంఘటనలు తీవ్రవాద నెట్‌వర్క్‌లపై ఒత్తిడిని సూచిస్తున్నాయి.
ఈ వైరల్ దశ్యాలు, సంబంధిత వాదనలు పాకిస్తాన్‌లో తీవ్రవాద వర్గాల్లో నెలకొన్న అసురక్షిత భావనను ప్రతిబింబిస్తున్నాయి. గత దాడుల చరిత్ర, ప్రస్తుత ఘటనలు కలిసి ప్రాంతీయ భద్రతా సవాళ్లను మళ్లీ చర్చలోకి తెస్తున్నాయి. అధికారిక నిర్ధారణలు, స్వతంత్ర విచారణలు జరిగితేనే పూర్తి చిత్రం స్పష్టమవుతుంది.
Another islamic terrorist deleted by unknown gunman in Pakistan
One of the key mastermind of 2008 Mumbai terrorist attack, UN designated Terrorist Zaki-ur-Rehman Lakhvi’s relative & recruiter in terrorist organisation Jaish-e-Mohammad, Hafiz Zulfiqar has been killed in Pakistan pic.twitter.com/z5Pz6sdOZO
— Baba Banaras™ (@RealBababanaras) August 30, 2026