Homeఎంటర్టైన్మెంట్మహానటికే ఓటేసిన మహేష్ బాబు

మహానటికే ఓటేసిన మహేష్ బాబు

ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో సినీ నటుల కాల్ షీట్స్ చాలా వేస్టవడం జరిగింది. దానికి తగ్గట్టు చాలా సినిమాల్లో తారాగణం విషయం లో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వేళ్ళ బోయే పవన్ కళ్యాణ్ చిత్రం లో హీరోయిన్ సెలక్షన్ విషయం లో కూడా అదే జరిగింది. అలాగే బన్నీ , సుకుమార్ చిత్రం లో కూడా కీలక పాత్రల విషయం లో కూడా అనేక మార్పులు చేర్పులు జరుగు తున్నాయి. […]

ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో సినీ నటుల కాల్ షీట్స్ చాలా వేస్టవడం జరిగింది. దానికి తగ్గట్టు చాలా సినిమాల్లో తారాగణం విషయం లో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వేళ్ళ బోయే పవన్ కళ్యాణ్ చిత్రం లో హీరోయిన్ సెలక్షన్ విషయం లో కూడా అదే జరిగింది. అలాగే బన్నీ , సుకుమార్ చిత్రం లో కూడా కీలక పాత్రల విషయం లో కూడా అనేక మార్పులు చేర్పులు జరుగు తున్నాయి. ఇక తాజాగా మహేష్ బాబు సినిమాకి కూడా మార్పులు చేర్పులు తప్పలేదు.

వైద్యులకు అండగా నిలిచిన జనసేనాని

`సరిలేరు నీకెవ్వరు ` చిత్రం తో 2020 సంవత్సరాన్ని సక్సెస్ ఫుల్ గా ఆరంభించిన మహేష్ బాబు తన తరువాత చిత్రానికి తారాగణం ఎంపిక విషయం లో దర్శకుడితో కల్సి చాలా కష్టపడు తున్నాడు. గీత గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వం లో రూపొంద బోయే తన కొత్త చిత్రానికి కథానాయిక ఎంపికలో ఇంకా స్థిర నిర్ణయానికి రాలేక పోతున్నాడు. మొదట కీర్తి సురేష్ ని అనుకోని ఆ తర్వాత బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు అయిన సారా అలీ ఖాన్ ని హీరోయిన్ గా అనుకొన్నారు. కానీ ఏమైందో తెలియదు గాని ఆ తరవాత `సాహో` ఫేమ్ శ్రద్దా కపూర్ పేరు పరిశీలన లోకి వచ్చింది. ఇపుడు శ్రద్దా కపూర్ ని కూడా కాదనుకొని మొదట అనుకున్నట్టుగా అందాలభామ, మహానటి కీర్తి సురేష్ నే కన్ఫర్మ్ చేశారని రూఢీగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ అటు తమిళంలో రజనీకాంత్ తో ఓ చిత్రం.. ఇటు తెలుగులో `తొలి ప్రేమ ` ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో `రంగ్ దే ` చిత్రం లో నితిన్ తో కలిసి నటిస్తోంది .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper