
Kavya Kalyan Ram : కావ్యా కళ్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తుంది. హీరోయిన్ గా ఆమె నటించిన మసూద, బలగం విజయాలు సాధించాయి. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మసూద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలు చేశారు. కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీలో ఆమె పాత్రకు చెప్పుకోదగ్గ నిడివి లేదు. హీరో లవ్ ఇంట్రెస్ట్ గా యూత్ఫుల్ రోల్ చేశారు. సినిమా ప్రధాన భాగం సంగీత, తిరువీర్ మీదే సాగుతుంది.

ఆమె రెండవ చిత్రం బలగం సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బలగం చిత్రంలో కావ్యా కళ్యాణ్ రామ్ సంధ్య పాత్ర చేశారు. హీరో మేనత్త కూతురు పాత్రలో అలరించారు. బలగం మూవీలో అన్ని పాత్రలో గుర్తిండిపోతాయి. వాటిలో సంధ్య పాత్ర కూడా ఒకటి. ఒక ఎమోషనల్ స్టోరీలో దర్శకుడు సంధ్య పాత్రతో తగుపాళ్లలో రొమాన్స్, కామెడీ పండించాడు.

బలగం మూవీ అనేక అంతర్జాతీయ అవార్డ్స్ కొల్లగొడుతుంది. ఇప్పటి వరకు బలగం చిత్రానికి 9 ఇంటర్నేషనల్ అవార్డ్స్ దక్కినట్లు సమాచారం. దర్శకుడు వేణుతో పాటు ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ అవార్డ్స్ గెలుచుకున్నారు. నిర్మాత దిల్ రాజు బలగం చిత్రాన్ని ఆస్కార్ కి పంపనున్నట్లు స్పష్టం చేశారు. కాబట్టి భవిష్యత్తులో బలగం మరిన్ని సంచలనాలు నమోదు చేసే ఆస్కారం కలదు.

బలగం మూవీ తనకు బ్రేక్ ఇస్తుందని కావ్యా కళ్యాణ్ రామ్ గట్టిగా నమ్ముతుంది. టైర్ టు హీరోల చిత్రాల్లో ఆఫర్స్ దక్కే సూచనలు కలవు. వరుసగా రెండు హిట్స్ ఇచ్చి లక్కీ హీరోయిన్స్ జాబితాలో చేరిన కావ్యాకు టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. అయితే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. అది ఆమెకు మైనస్.

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన కావ్యా కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రి చిత్రంలో కావ్యా కళ్యాణ్ రామ్ చిన్నప్పటి హీరోయిన్ పాత్ర చేసింది. ఆ సినిమా షూటింగ్ లో నువ్వు పెద్దయ్యాక… నా పక్కన హీరోయిన్ గా తీసుకుంటానని అల్లు అర్జున్ అన్నాడట. ఆ మాటకు కావ్యా… అప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు అని ఇన్నోసెంట్ ఆన్సర్ చెప్పిందట. పవన్ కళ్యాణ్-శ్రియ కాంబినేషన్ లో తెరకెక్కిన బాలు మూవీలో కూడా కావ్యా చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేశారు.