Junior NTR: యమదొంగ సినిమాలో ఎంట్రీ సీన్ చూశారా.. అందులో జూనియర్ ఎన్టీఆర్ మ్యాజిక్ చేసే వ్యక్తి లాగా కనిపిస్తాడు. వేదిక మీదికి పులిలాగా ఎంట్రీ ఇస్తాడు. అప్పట్లో ఈ సీన్ ఒక సెన్సేషన్. మళ్లీ దానిని ఇప్పుడు don’t trouble the trouble సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ రిపీట్ చేశాడు. అంతేకాదు చూస్తున్న ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు.
ఇటీవల డ్రాగన్ టీజర్ విడుదలైంది. అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇలా కనిపించలేదు. Don’t trouble the trouble సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అందంగా కనిపించాడు. డ్రాగన్ లుక్ లో ఉన్న అతడు.. వేదిక మీదికి యమదొంగ సినిమాలో మాదిరిగా ఎంట్రీ ఇచ్చాడు. దీని వెనుక ఉంది కార్తికేయ. మండుతున్న అగ్ని గోలాల నుంచి పులి దూకే సీన్ ఎండ్ కాగానే.. జూనియర్ ఎన్టీఆర్ వేదిక మీదికి వచ్చారు. అప్పటికే వేదిక మీద ఉన్న సుమ.. బేబీ సారా ఆ సీన్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
వేదిక మీద రాజమౌళి.. రమా రాజమౌళి.. కీరవాణి.. వల్లి.. కాలభైరవ.. కార్తికేయ.. సింహ వంటి వారితో తనకున్న అనుబంధాన్ని జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇది తన కుటుంబం అని వ్యాఖ్యానించారు. చివర్లో అభిమానులు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని.. మీకోసమే ఎదురుచూసే కుటుంబ సభ్యుల కోసం జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. తద్వారా అభిమానుల మీద తనకున్న ప్రేమను మరోసారి నిరూపించారు. అంతకుముందు రమా రాజమౌళి తన వెనుక కూర్చున్న నేపథ్యంలో.. సీటు దూకి ఆమె దగ్గరికి వెళ్లారు. ఆమెను ఆప్యాయంగా పలకరించారు. రమా కూడా అంతే స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమను వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య తల్లి కొడుకు లాంటి సంబంధం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తూ ఉంటుంది. దానిని మరోసారి జూనియర్ ఎన్టీఆర్ నిజం చేసి చూపించారు.
ఇదే వేదిక ద్వారా డ్రాగన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారు. కాకపోతే దానికి ఇంకా సమయం ఉందని వెల్లడించారు. అభిమానుల అంచనాలను డ్రాగన్ ఏమాత్రం తక్కువ చేయదని.. సినిమా అద్భుతంగా వస్తోంది అని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి కూడా ఫహద్ గురించి కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఈ సినిమా మోస్ట్ ప్రామిసింగ్ గా ఉందని వ్యాఖ్యానించిన జూనియర్ ఎన్టీఆర్.. కచ్చితంగా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎస్ఎస్ కార్తికేయ ఆధ్వర్యంలో నింగి నుంచి పూల వర్షం కురిపించారు. జూనియర్ ఎన్టీఆర్ మీద తనకున్న అభిమానాన్ని అనేక సందర్భాలలో నిరూపించుకున్న కార్తికేయను యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియా వ్యతిరేకంగా ఆకాశానికి ఎత్తుతున్నారు.. అభిమానమంటే ఇలా ఉండాలని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్థాయిలో జూనియర్ మీద అభిమానం చూపించిన కార్తికేయకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
Young Tiger NTR Grand Entry at Dont Trouble The Trouble Telugu Pre- Release event #tollywood #ezcutmedia #ezcutentertainment pic.twitter.com/Ua2olvKnU8
— EZ Cut Entertainment (@EZCutentertain) September 29, 2026
NTR Bonding with Rajamouli wife rama garu ❤️@tarak9999 pic.twitter.com/65nW8CumF6
— : (@KamalHassan97) September 29, 2026