Homeఆంధ్రప్రదేశ్‌TDP: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ఇచ్చింది ధైర్యం..

TDP: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ఇచ్చింది ధైర్యం..

TDP: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం చేసింది.. నిండా ముంచింది. రిజర్వేషన్లను తగ్గించింది. పైగా కీలక పదవులను రాయలసీమ రెడ్లకు ఇచ్చింది. కేవలం తిట్టిపోయడానికి.. కేసులు ఎదుర్కోవడానికి.. జైలు పాలు కావడానికి మాత్రమే బీసీలను వాడుకుంది. ఇదంతా కూడా ఎన్నో రోజులు సాగలేదు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీసీల బతుకు బాగుపడడం మొదలైంది. సమాజంలో సగ భాగంగా ఉన్న బీసీలకు కూటమి ప్రభుత్వం […]

TDP: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం చేసింది.. నిండా ముంచింది. రిజర్వేషన్లను తగ్గించింది. పైగా కీలక పదవులను రాయలసీమ రెడ్లకు ఇచ్చింది. కేవలం తిట్టిపోయడానికి.. కేసులు ఎదుర్కోవడానికి.. జైలు పాలు కావడానికి మాత్రమే బీసీలను వాడుకుంది.

ఇదంతా కూడా ఎన్నో రోజులు సాగలేదు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీసీల బతుకు బాగుపడడం మొదలైంది. సమాజంలో సగ భాగంగా ఉన్న బీసీలకు కూటమి ప్రభుత్వం సింహభాగం అవకాశాలు కల్పిస్తోంది. అంతేకాదు స్థానిక సంస్థల్లో ఏకంగా 34 శాతం రిజర్వేషన్లు అందిస్తోంది. చట్టాన్ని అతిక్రమించకుండా.. నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లతోనే పట్టణ స్థానిక సంస్థలు (ULBs), గ్రామీణ స్థానిక సంస్థల (RLBs) కు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందంటే.. కూటమి ప్రభుత్వం గొప్పదనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం.. పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 331/3 శాతం రిజర్వేషన్ కల్పిస్తోంది. ఇక ఎస్సీలకు.. ఎస్టీలకు అందించే రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. వారికోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న రిజర్వేషన్లు యధావిధిగా అమలు జరుగుతూ ఉంటాయి. బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డేడికేటెడ్ కమిషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది..

ముమ్మాటికి బీసీల పార్టీ

టిడిపి దేశం లోనే తొలిసారిగా బీసీలకు రాజ్యాధికారం అని మాట్లాడింది. అవకాశాలు కూడా కల్పించింది. నాడు సీనియర్ ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో బీసీలకు అవకాశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు,. ఎంపీ స్థానాలలో పోటీ చేసేందుకు వారికి టికెట్లు ఇచ్చారు. బీసీలను ఒక వర్గంగా గుర్తించి.. వారందరినీ కూడా ఒక గొడుగు కిందికి తీసుకొచ్చారు. దీంతో దేశంలోనే తొలిసారిగా బీసీల గురించి.. వారి ప్రాతినిధ్యం గురించి.. సంక్షేమ గురించి చర్చ మొదలైంది. అందువల్లే బీసీలు టిడిపిని ఇది నా పార్టీ అని గొప్పగా చెప్పుకుంటారు. దేశంలో మరే పార్టీ కూడా బీసీలకు ఈ స్థాయిలో దగ్గర కాలేదు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా టిడిపికి… బీసీలకు అవినాభావ సంబంధం ఉంది.

అది మాత్రమే కాదు

రాజకీయ ప్రాధాన్యం అంటే కేవలం పార్టీ పరంగా సీట్లు.. పదవులు ఇవ్వడం మాత్రమే కాదు.. లోకల్ బాడీ ఎలక్షన్లో చట్టపరమైన రిజర్వేషన్ కల్పించడం ద్వారా గ్రామస్థాయి నుంచి బీసీలలో నాయకత్వ లక్షణాలు పెంచేలా చేసింది ముమ్మాటికి సీనియర్ ఎన్టీఆరే. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు హయాంలో దీనిని మరింత ముందుకు తీసుకెళ్లారు. 1995లో స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి రిజర్వేషన్ల విషయంలో 34 శాతానికి పెంచారు. బీసీలపై టిడిపికి ఏ స్థాయిలో చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

వైసీపీ పరిపాలన కాలంలో

టిడిపికి బీసీలు అండగా ఉన్నారని కోపంతో వైసీపీ పరిపాలన కాలంలో వారిని ఇబ్బంది పెట్టారు. బీసీల నాయకత్వంపై హత్యా రాజకీయాలను మోపారు. హింసతో ఇబ్బంది పెట్టారు. వైసీపీ పాపాలు అక్కడితోనే ఆగలేదు. బీసీల మీద ఉన్న కక్షతో.. పగతో గడిచిన 30 ఏళ్ల నుంచి ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి పడగొట్టారు. దీంతో 16 వేల ఎనిమిది వందల మంది పదవులు కోల్పోయారు. ఆ తర్వాత 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమం మళ్లీ మొదలైంది.

బీసీలకు ఈ రెండు సంవత్సరాల కాలంలో అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్.. ఇతర సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం 32,534 కోట్లు ఖర్చు చేసింది. వడ్డెర్లకు 10% మైనింగ్ లీజులు ఇస్తోంది. గీత కార్మికులకు 10 శాతం ఎక్సైజ్ షాపులు కేటాయించింది. నేత కార్మికులకు ఒక్క కుటుంబానికి ఏడాదికి 25వేల దాకా ఇస్తోంది. హ్యాండ్లూమ్ మగ్గాలకు కుటుంబానికి నెలకు 200 యూనిట్లు.. పవర్ లోన్ మగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. సముద్రంలో చేపల వేటను నిషేధించినప్పుడు మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని చంద్రబాబు తీసుకొచ్చారు. మత్స్యకారుల సేవలో పదకం ద్వారా వేట విరామం సమయంలో వారికి 20,000 ఇస్తోంది. రాయితీ మీద బోట్లు.. డీజిల్ కూడా ఇస్తుంది. గడిచిన ప్రభుత్వం ఆ న్యాయంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 217 మొత్తాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. మత్స్యకారుల సొసైటీ హక్కులను కూటమి ప్రభుత్వం కాపాడింది. మత్స్యకార మహిళలకు సీ వీడ్ స్కీం ద్వారా శిక్ష నుంచి ఉపాధి కల్పిస్తోంది. నాయి బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్ లకు నెలకు 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ తీసుకువచ్చింది. దేవాలయాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇచ్చే భృతిని 15 వేల నుంచి 25 వేలకు పెంచింది.

ఏపీ రాష్ట్రంలో బీసీల జనాభా 2.66 కోట్లు. అంటే మొత్తం జనాభాలో బీసీలు 50.42 శాతం గా ఉన్నారు. 138 బీసీ ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా తొలిరోజు నుంచి పనిచేయడం మొదలుపెట్టింది టిడిపి. గ్రామీణ జనాభాలో బీసీలు 48.44%, పట్టణ జనాభాలో బీసీలు 54.36 శాతం గా ఉన్నారు. ఈ స్థాయిలో రిజర్వేషన్లు కల్పిస్తున్న నేపథ్యంలో.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగడం బీసీల కర్తవ్యం. ఎవరో చెప్పిన మాయమాటలు నమ్మితే చివరికి మోసపోయేది కూడా బీసీలే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper