Jason Sanjay : తమిళ హీరోల పై మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం అక్కడ టాప్ హీరోలుగా చలామణి అవుతున్న అనేక మంది పవన్ కళ్యాణ్ అభిమానులే. వారిలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సినది తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ గురించి. ఈయన ఒక ఈవెంట్ లో నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అంటూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అదే విధంగా విక్రమ్, శింబు , ధనుష్, ప్రదీప్ రంగనాథన్ ఇలా ఎంతో మంది హీరోలు అనేక సందర్భం లో మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ జాబితాలోకి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు జేసన్ సంజయ్ కూడా చేరిపోయాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
యాంకర్ సంజయ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మిమ్మల్ని డైరెక్షన్ వైపు అడుగులు వేసేలా చేసిన 5 సినిమాల పేర్లు చెప్పమంటే , మీరు ఏమి చెప్తారు’ అని అడగ్గా, జేసన్ సంజయ్ ‘అరణ్య కాండం, జిగర్తాండ , తుపాకీ, అయాన్ , జానీ’ సినిమాల పేర్లు చెప్పాడు. ‘జానీ’ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. వరుసగా 7 సూపర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత , ఆయన స్వీయ దర్శకత్వం లో చేసిన ఈ సినిమా , అప్పట్లో కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ విడుదలై , ఫ్యాన్స్ ని తీవ్రమైన నిరాశకు గురి చేసింది. కానీ ఆరోజుల్లో ఈ చిత్రం ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు కానీ , నేటి తరం ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా చాలా బాగా ఇష్టం.
ముఖ్యంగా జెన్ జీ డైరెక్టర్స్ కి ఈ సినిమా ఒక బుక్ లాగా ఉపయోగపడుతుంది. ఆ రేంజ్ లో డిఫరెంట్ టేకింగ్ తో పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాంటి సినిమా జేసన్ సంజయ్ కి కూడా ఇష్టం అనడంతో , పవన్ అభిమానులు జానీ గొప్పతనం గురించి మరోసారి సోషల్ మీడియా లో తెలుపుతూ, పాత గణపకాలను నెమరువేసుకుంటున్నారు. ఇకపోతే జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన చిత్రం పేరు ‘సిగ్మా’. మన టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా , జేసన్ సంజయ్ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు.