Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan Collection: 'జన నాయగన్ ' 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే విజయ్ చివరి చిత్రం కాబట్టి , భవిష్యత్తులో ఆయన సినిమాల్లో నటించే అవకాశం లేదు కాబట్టి , తమిళ ఆడియన్స్ టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకు మొదటి […]

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే విజయ్ చివరి చిత్రం కాబట్టి , భవిష్యత్తులో ఆయన సినిమాల్లో నటించే అవకాశం లేదు కాబట్టి , తమిళ ఆడియన్స్ టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకు మొదటి రోజు బంపర్ ఓపెనింగ్ ని అందించారు. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 80 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ రెండవ రోజు మాత్రం ఫ్లాప్ టాక్ ప్రభావం చాలా గట్టిగా కనబడింది అనే చెప్పాలి. 50 శాతం డ్రాప్స్ ఉంటే పర్వాలేదు అనుకోవచ్చు , అంతకు మించి ఎక్కువ ఉంటే డిజాస్టర్ అనొచ్చు.

ఈ సినిమాకు అదే జరిగింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం , ఈ చిత్రానికి రెండవ రోజున తమిళనాడు నుండి 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కేరళ నుండి 2 కోట్ల గ్రాస్ వసూళ్లు ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ ప్రాంతాల నుండి 1 కోటి 88 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ లో వచ్చిన వసూళ్లు కోటి రూపాయిల గ్రాస్ కంటే తక్కువ అట. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా కర్ణాటక రాష్ట్రాన్ని కలుపుకొని ఈ చిత్రానికి 2 వ రోజున 18 కోట్ల 88 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో దాదాపుగా 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపుగా 9 నుండి 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట.

ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 28 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండు రోజులకు కలిపి 108 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. మొదటి రోజు ఈ చిత్రానికి వస్తుందని అనుకున్న గ్రాస్ ఇది , రెండు రోజులకు కలిపి వచ్చింది. కానీ ఇలాంటి డిజాస్టర్ టాక్ తో ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు ప్రస్తుతం భారతదేశం లో విజయ్ కి తప్ప ఎవరికీ సాధ్యం అవ్వదు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చివరి సినిమా , ముఖ్యమంత్రి అయ్యాక విడుదల అవుతున్న మొదటి సినిమా కాబట్టి , ఈ మాత్రం ఊపు ఉండడం సహజమే అని అనుకోవచ్చు కానీ , ఇది ఇతరులకు అసాధ్యమైన రేర్ ఫీట్ అనే చెప్పొచ్చు. నేడు రేపు కచ్చితంగా వసూళ్లు బాగుంటాయి కాబట్టి , ఈ సినిమా ఫుల్ రన్ లో 200 కోట్ల గ్రాస్ ని అవలీలగా అందుకోగలదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper