Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా కి వస్తున్నటువంటి వసూళ్లను చూస్తుంటే , విజయ్ ని మించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ లో ఇండియాలో మరొకరు లేరు అనిపిస్తోంది. సూపర్ హిట్ అయితేనే 300 కోట్ల గ్రాస్ ని రాబట్టలేని ఈ రోజుల్లో , విజయ్ ఏకంగా ఒక డిజాస్టర్ సినిమాతో ఆ గ్రాస్ ని అందుకోబోతున్నాడు. 10 రోజుల రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 280 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ , రామ్ చరణ్ వంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ కి కూడా ఒక డిజాస్టర్ సినిమాతో ఇలాంటి ఫీట్ లేదు.
వాళ్ళు ఇదే టాక్ తో కేవలం 200 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టారు. కానీ విజయ్ మాత్రం ఏకంగా 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరబోతున్నారు. నేటితో ఈ చిత్రం 290 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాగా నిలవబోతుంది. రేపు , ఎల్లుండి తో కలిపి ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే జరిగితే డిజాస్టర్ టాక్ తో 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన మొదటి హీరో మరియు చివరి హీరో గా విజయ్ నిలిచిపోతాడు అని చెప్పొచ్చు. ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు నుండి 114 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా , తెలుగు రాష్ట్రాల నుండి 12 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.
అదే విధంగా కర్ణాటక రాష్ట్రము నుండి 29 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కేరళ నుండి 16 కోట్లు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 19 కోట్ల 60 లక్షలు , ఓవర్సీస్ నుండి 88 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు సోలో గా ఓవర్సీస్ లో 100 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన హీరో ప్రభాస్ మాత్రమే. అది కూడా సూపర్ హిట్ సినిమాలతో , అలాంటిది విజయ్ డిజాస్టర్ టాక్ చిత్రం ఓవర్సీస్ నుండి 100 కోట్ల గ్రాస్ ని రాబట్టే పరిస్థితి లో ఉందంటే , ఆయనకు ఉన్నటువంటి ప్రజాధారణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం థియేట్రికల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.