Jana Nayagan : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి , ప్రముఖ సినీ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టాక్ అయితే డిజాస్టర్ వచ్చింది కానీ , వసూళ్లు మాత్రం సౌత్ స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల రేంజ్ లో ఉన్నాయి. వీకెండ్ తర్వాత ఈ చిత్రం వసూళ్లు భారీగా పడిపోతాయని అంతా అనుకున్నారు. కానీ లాంగ్ వీకెండ్ తర్వాత కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 5 వ రోజున వరల్డ్ వైడ్ గా 14 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
ఒక డిజాస్టర్ టాక్ సినిమాకు వర్కింగ్ డే రోజున ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడమంటే విజయ్ కి ఎలాంటి ప్రజాధారణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయి ప్రజాధారణ ఉండబట్టే , ఆయన మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి అయిపోయాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి 5 రోజుల్లో 93 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, తెలుగు రాష్ట్రాల నుండి 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. నేటితో ఈ చిత్రం తమిళనాడు లో 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరబోతోంది. అదే విధంగా కర్ణాటక నుండి ఈ చిత్రానికి కేవలం 5 రోజుల్లోనే 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.
మన టాలీవుడ్ స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వడం కష్టమంటే అతిశయోక్తి కాదేమో. అదే విధంగా కేరళ రాష్ట్రము నుండి 13 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 16 కోట్ల 5 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ నుండి 74 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 234 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 106 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవాలంటే మరో 102 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.