Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan First Week Collection: 'జన నాయగన్' మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Jana Nayagan First Week Collection: ‘జన నాయగన్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే..

Jana Nayagan First Week Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ వచ్చిన డిజాస్టర్ టాక్ కి , బాక్స్ ఆఫీస్ వద్ద కురుస్తున్న వసూళ్ల వర్షానికి అసలు సంబంధమే లేదు. సాధారణంగా విజయ్ రేంజ్ సూపర్ స్టార్స్ కి వీకెండ్ వరకు టాక్ తో సంబంధం […]

Jana Nayagan First Week Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ వచ్చిన డిజాస్టర్ టాక్ కి , బాక్స్ ఆఫీస్ వద్ద కురుస్తున్న వసూళ్ల వర్షానికి అసలు సంబంధమే లేదు. సాధారణంగా విజయ్ రేంజ్ సూపర్ స్టార్స్ కి వీకెండ్ వరకు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తుంటాయి. కానీ ఈ చిత్రానికి వీకెండ్ తర్వాత సాధారణ వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇదే ట్రేడ్ ని విస్వయానికి గురి చేస్తున్న విషయం. 7 వ రోజున ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 10 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 4 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.

ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి మొదటి వారం వచ్చిన వసూళ్లు ఎంతో వివరంగా చూద్దాం. తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి మొదటి వారం లో 102 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి 12 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అందులో నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతం నుండి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక రాష్ట్రము విషయానికి వస్తే , మొదటి వారం లో ఈ చిత్రానికి 27 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కేరళ రాష్ట్రం నుండి 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 18 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఓవర్సీస్ నుండి అయితే ఈ చిత్రానికి ఏకంగా 81 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది తమిళనాడు లో కొంతమంది స్టార్ హీరోల సూపర్ హిట్స్ తో సమానం. మన తెలుగు హీరోలకు అయితే సూపర్ హిట్ టాక్ వచ్చిన ఈ రేంజ్ గ్రాస్ రాదు, అందుకు రీసెంట్ ఉదాహరణ ‘పెద్ది’. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 117 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 257 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ ని పొందాలంటే , ఈ చిత్రం మరో 85 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యమే కానీ , ఈ వీకెండ్ పెర్ఫార్మన్స్ ని బట్టి , ఈ చిత్రం లాంగ్ రన్ లో 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది డిసైడ్ కానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper