Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan : డిజాస్టర్ టాక్ తో ఇదేమి ప్రభంజనం సామీ.. 6 రోజుల్లో 'జన...

Jana Nayagan : డిజాస్టర్ టాక్ తో ఇదేమి ప్రభంజనం సామీ.. 6 రోజుల్లో ‘జన నాయగన్’ కి వచ్చిన గ్రాస్ ఎంతో తెలుసా..

పాజిటివ్ టాక్ వస్తేనే జనాలు థియేటర్స్ కి కదిలి వెళ్లడం గగనం అయిపోతున్న ఈ రోజుల్లో, డిజాస్టర్ టాక్ తో ఓపెనింగ్స్ ని రాబట్టడమే కాకుండా, ఫుల్ రన్ లో కూడా కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ట్రేడ్ పండితులకు సైతం మెంటలెక్కిపోయేలా చేసే హీరో ప్రస్తుతం మన భారత దేశం లో విజయ్ తప్ప , మరొకరు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు ఆయన చివరగా చేసిన చిత్రం ‘జన […]

పాజిటివ్ టాక్ వస్తేనే జనాలు థియేటర్స్ కి కదిలి వెళ్లడం గగనం అయిపోతున్న ఈ రోజుల్లో, డిజాస్టర్ టాక్ తో ఓపెనింగ్స్ ని రాబట్టడమే కాకుండా, ఫుల్ రన్ లో కూడా కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ట్రేడ్ పండితులకు సైతం మెంటలెక్కిపోయేలా చేసే హీరో ప్రస్తుతం మన భారత దేశం లో విజయ్ తప్ప , మరొకరు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు ఆయన చివరగా చేసిన చిత్రం ‘జన నాయగన్’. సెన్సార్ కష్టాలను ఛేదించి ఎట్టకేలకు రీసెంట్ గానే ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. తమిళనాడు రాష్ట్రానికి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక విడుదలైన సినిమా కావడం తో , ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ దక్కాయి. ఇది సహజమే కదా, వీకెండ్ తర్వాత సినిమా వసూళ్లు బాగా తగ్గిపోతాయని అంతా అనుకున్నారు.

కానీ స్టడీ వసూళ్లతో ట్రేడ్ విశ్లేషకులను కూడా విస్మయానికి గురి చేస్తూ ముందుకెళ్తోంది ఈ చిత్రం. మొదటి వీకెండ్ తో 220 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి 5 వ రోజున ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 6 వ రోజున 12 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా ఎంతటి స్టడీ కలెక్షన్స్ తో ముందుకు వెళ్తుందో అనేది. ప్రాంతాల వారీగా వచ్చిన గ్రాస్ వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు ప్రాంతం నుండి 98 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు రాష్ట్రాల నుండి 11 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక రాష్ట్రం నుండి 27 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కేరళ రాష్ట్రము నుండి 14 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అదే విధంగా హిందీ లో కూడా ఈ చిత్రానికి ఎవ్వరూ ఊహించనంత గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వడం గమనార్హం. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి హిందీ వెర్షన్ నుండి 17 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ నుండి 78 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి 247 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ వీకెండ్ వచ్చే వసూళ్లను బట్టి , ఈ చిత్రం లాంగ్ రన్ లో 300 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంటుందా లేదా అనేది డిసైడ్ అవ్వబోతుంది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రం మరో 90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper