Homeఎంటర్టైన్మెంట్Irumudi Movie: 'ఇరుముడి' లో ఆ సన్నివేశాలను తొలగించబోతున్నారా..? ఇలా చేస్తే కష్టమే!

Irumudi Movie: ‘ఇరుముడి’ లో ఆ సన్నివేశాలను తొలగించబోతున్నారా..? ఇలా చేస్తే కష్టమే!

Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ‘బాహుబలి 2’ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ రన్ ని సొంతం చేసుకున్న ఏకైక సినిమా ‘ఇరుముడి’ మాత్రమేనని ట్రేడ్ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క సెంటర్ లో ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లు ఆ రేంజ్ […]

Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ‘బాహుబలి 2’ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ రన్ ని సొంతం చేసుకున్న ఏకైక సినిమా ‘ఇరుముడి’ మాత్రమేనని ట్రేడ్ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క సెంటర్ లో ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లు ఆ రేంజ్ లో ఉన్నాయి మరి. ఇప్పటికీ ఈ సినిమా వర్కింగ్ డేస్ లో 5 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను రాబట్టే పరిస్థితి లో ఉందంటే, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక సినిమా పెద్ద హిట్ అయ్యినప్పుడు , దాని చుట్టూ వివాదాలు కూడా చక్కర్లు కొట్టడం సహజమే.

అనాదిగా ఈ సంస్కృతి కొనసాగుతూ వస్తోంది. ఇరుముడి చుట్టూ కూడా అలాంటి వివాదాలే అలుముకున్నాయి. ఈ సినిమాలో ప్రభుత్వ స్కూల్స్ ని కించపరిచే విధంగా ఉన్నాయని, ఉపాధ్యాయులను తప్పుగా చూపించారని, వారి మనోభావాలు దెబ్బ తిన్నాయని, తక్షణమే ఆ సన్నివేశాలను తొలగించాలని , లేదని పక్షం లో సినిమాని బ్యాన్ చేయాలంటూ రీసెంట్ గా కొన్ని విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి లేఖలు కూడా రాశారు. రోజురోజుకి ఈ వ్యవహారం హీట్ ఎక్కుతుండడం తో ఈ సన్నివేశాలను మేకర్స్ తొలగించబోతున్నారా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఆ సన్నివేశాలను తొలగిస్తే అసలు సినిమాలో పవర్ ఉండదని, కొత్తగా చూసే ఆడియన్స్ కి సినిమా నచ్చదని అంటున్నారు విశ్లేషకులు. కానీ మేకర్స్ నుండి ఇప్పటి వరకు ఈ వివాదం పై ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం గమనార్హం.

ఒక సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు, అక్కడ స్పందిస్తారేమో అనుకుంటే , అసలు ఈ విషయాన్నే ప్రస్తావన కి తీసుకొని రాలేదు. త్వరలోనే అభిమానుల సమక్షం లో గ్రాండ్ గా ఒక విజయోత్సవ సభని ఏర్పాటు చేయబోతున్నారట మేకర్స్. ఈ సభ లోనైనా మాట్లాడుతారో లేదో చూడాలి. మరోపక్క ఈ చిత్రం నేటితో ప్రతిష్టాత్మక 200 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టబోతుంది. 100 కోట్ల గ్రాస్ ని రాబడితే ఎక్కువ అని విడుదల రోజు అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే 200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడమే కాకుండా , ఫుల్ రన్ లో 250 కోట్ల గ్రాస్ దిశగా అడుగులేస్తోంది ఈ చిత్రం. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper