Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సెన్సేషనల్ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, కనీవినీ ఎరుగని రేంజ్ గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది ఈ చిత్రం. సోమవారం రోజున , అనగా వర్కింగ్ డే లో ఈ చిత్రానికి కేవలం ఒక్క నైజాం ప్రాంతం నుండే 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు అయితే 7 కోట్ల రూపాయలకు పైమాటే. ఈమధ్య కాలం లో పేరు మోసిన పాన్ ఇండియన్ స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ వసూళ్లు నమోదు అవ్వలేదంటే అతిసయోక్తి కాదేమో. ఓవరాల్ గా 4 వ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
ఈ రేంజ్ సెన్సేషనల్ ఆక్యుపెన్సీలతో ముందుకు దూసుకెళ్తున్న ఈ సినిమాకు రేపటి నుండి థియేటర్స్ కొరత ఉండనుంది. ఎందుకంటే కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం విడుదల కాబోతుంది కాబట్టి. ఈ సినిమా తెలుగు వర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ రేటుకి కొనుగోలు చేశాడు. అందుకే ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ హీరో మూవీ రేంజ్ లో భారీ లెవెల్ లో విడుదల చేస్తున్నాడు. నైజం ప్రాంతం లో అయితే కేవలం మైత్రీ మూవీ మేకర్స్ లీజ్ థియేటర్స్ తప్ప, మిగిలిన అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ‘టాక్సిక్’ కి వెళ్ళబోతున్నాయి. ఈ ప్రభావం ‘ఇరుముడి’ కలెక్షన్స్ పై చాలా గట్టిగా పడే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి. కాబట్టి, సోలో గా థియేటర్స్ ‘ఇరుముడి’ హోల్డ్ చేసే చివరి రోజు ఇదేనని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఒకవేళ టాక్సిక్ చిత్రం ఫ్లాప్ అయితే , దానికి కేటాయించిన థియేటర్స్ ‘ఇరుముడి’ కి షిఫ్ట్ అవుతాయని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. హిట్ అయినా , ఫ్లాప్ అయినా ఈ వీకెండ్ వరకు ‘టాక్సిక్’ థియేటర్స్ అగ్రీమెంట్స్ అయిపోయాయి. వీకెండ్ తర్వాత మాత్రం ‘ఇరుముడి’ కి థియేటర్స్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ‘ఇరుముడి’ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ చూస్తుంటే , కేవలం 100 కోట్ల గ్రాస్ ని దాటుతుందని అందరూ అనుకున్నారు. కానీ నేటితో 100 కోట్ల గ్రాస్ మార్కుని దాటింది , ఫుల్ రన్ లో కచ్చితంగా 250 కోట్ల గ్రాస్ మార్కుని ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.