Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్స్ ఆఫీస్ సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అనుకోవడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. విడుదలైన మూడు రోజుల్లో ఈ సినిమా టికెట్స్ కోసం జనాలు బారులు తీసిన విధానం చూస్తుంటే , రవితేజ తన స్టామినా ని గత ఐదేళ్లు గా ఎలా వృధా చేసాడో అర్థం అవుతోంది. రవితేజ సరైన హిట్ కొడితే ఎలా ఉంటుందో ఈ జనరేషన్ జనాలకు తెలియదు. ఈ సినిమాతో ‘వామో.. రవితేజ స్టార్ డమ్ ఇలాంటిదా’ అని ఆశ్చర్యపోతున్నారు. కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కేవలం ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ సినిమాని కొన్న బయ్యర్స్ ప్రతీ ఒక్కరు రూపాయికి 10 రూపాయిల లాభాలు అర్జించారు.
అయితే ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా , అందులో ఎంత పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఉన్నపటికీ, వీకెండ్ తర్వాత మొదటి సోమవారం ఎంతో కొంత డ్రాప్స్ ని సొంతం చేసుకోవడం సహజం. కానీ ఈ చిత్రం మొదటి సోమవారం రోజున(నేడు) కూడా కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టేలా ఉంది. బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 24 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. కేవలం వీకెండ్స్ లో మాత్రమే వసూళ్లను రాబట్టే ఈరోజుల్లో, మొదటి సోమవారం ఈ రేంజ్ ట్రెండ్ కనబర్చడం అంటే సాధారణమైన విషయం కాదు. హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్స్ నుండి మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ వరకు, టికెట్స్ నూన్ షోస్ కి కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ఈ ట్రెండ్ ని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి సోమవారం కచ్చితంగా 6 నుండి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇప్పటి వరకు ‘పుష్ప 2’, #RRR, ‘పెద్ది’ సినిమాలకు తప్ప , ఏ సినిమాకు కూడా మొదటి సోమవారం రోజున ఈ స్థాయి వసూళ్లు నమోదు అవ్వలేదు. పాన్ ఇండియన్ , పాన్ వరల్డ్ అని చెప్పుకొని విడుదలైన సినిమాలకు కూడా ఈ రేంజ్ రష్ ఎప్పుడూ చూడలేదు. అనేక ప్రాంతాల్లో నేడు మ్యాట్నీ షోస్ కి టికెట్స్ దొరకలేదు. బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. చాలా మంది ‘టాక్సిక్’ చిత్రం విడుదలైతే ‘ఇరుముడి’ కలెక్షన్స్ తగ్గిపోతాయేమో అని నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ‘ఇరుముడి’ ప్రభావం టాక్సిక్ మీద పడేలా ఉంది. చూడాలి మరి ఈ వసూళ్ల సునామీ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.