Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రోహిత్ కి చావుదెబ్బ..ఈ వారం 'బిగ్ బాస్ 10' లో...

Bigg Boss 10 Telugu: రోహిత్ కి చావుదెబ్బ..ఈ వారం ‘బిగ్ బాస్ 10’ లో డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్ళే!

Bigg Boss 10 Telugu: ఏ ముహూర్తం లో రోహిత్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడో తెలియదు కానీ , మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ప్రతీ సంఘటన ఆయనకు హౌస్ లో తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తున్నాయి. మొదటి వారం లో త్రిగున్ వ్యక్తిగతంగా రోహిత్ ని దూషించడం, ఆ తర్వాత సెలబ్రిటీలు మొత్తం అతనికి వ్యతిరేకంగా మారి టార్గెట్ చేయడం, చెయ్యని తప్పులకు నిందలు వేస్తూ నాగార్జున బిగ్ బాస్ గేట్స్ తెరిచి […]

Bigg Boss 10 Telugu: ఏ ముహూర్తం లో రోహిత్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడో తెలియదు కానీ , మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ప్రతీ సంఘటన ఆయనకు హౌస్ లో తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తున్నాయి. మొదటి వారం లో త్రిగున్ వ్యక్తిగతంగా రోహిత్ ని దూషించడం, ఆ తర్వాత సెలబ్రిటీలు మొత్తం అతనికి వ్యతిరేకంగా మారి టార్గెట్ చేయడం, చెయ్యని తప్పులకు నిందలు వేస్తూ నాగార్జున బిగ్ బాస్ గేట్స్ తెరిచి వెళ్ళిపో అని మాట్లాడడం , ఇలా ఒక్కటా రెండా ప్రతీ ఒక్కటి ఆయనకు మింగుడుపడనివ్వకుండా చేసింది. ఇక ప్రతీ వారం నామినేషన్స్ వస్తే చాలు రోహిత్ ని ఒక్కడిని చేసి సెలబ్రిటీలు అవమానిస్తూ ఉంటారు. ఇంతటి అవమానాలు , వెన్నుపోట్లు , బాధ ని రోహిత్ ని ఎలా తట్టుకుంటున్నాడో అని ఆయన అభిమానులు బాధ పడుతున్నారు.

ఇకపోతే నిన్న త్రిగున్ రోహిత్ ని నామినేట్ చేస్తూ , నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు నువ్వు చెప్పినట్టుగా ఆడి , ఒక్కొక్కరుగా హౌస్ నుండి వెళ్లిపోతున్నారు అని అంటాడు. అందుకు రోహిత్ తనదైన స్టైల్ లో ధీటుగా డిఫెండ్ చేసుకున్నాడు కానీ , ఈ వారం మరోసారి ఆయన స్నేహితుల్లో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ రోహిత్ , వంశీ , షాలిని, అమన్ , వర్షిణి , రామ్ ప్రసాద్. వీరిలో రోహిత్ కి తిరుగులేని ఓటింగ్ పడుతోంది , ఆయనే మొదటి స్థానం లో ఉన్నాడు. అయితే రోహిత్ తర్వాత అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్నటువంటి త్రిగున్ , ముకేశ్ లు లేకపోవడం తో , ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది వీళ్లిద్దరి అభిమానుల చేతుల్లోనే ఉంటుంది.

త్రిగున్ కి వంశీ బెస్ట్ ఫ్రెండ్ కావడంతో పాటు , ఈమధ్య కాలం లో రోహిత్ ని విపరీతంగా టార్గెట్ చేస్తుండడం వల్ల, త్రిగున్ ఫ్యాన్స్ మొత్తం వంశీ కి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ షాలిని ని హౌస్ లో ఉంచితే రోహిత్ గేమ్ చెడిపోతుంది కదా, షాలిని ని ఉంచుదామని త్రిగుణ ఫ్యాన్స్ అనుకుంటే , వంశీ ఎలిమినేట్ అవ్వొచ్చు. కానీ ఆ పరిస్థితులు ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఇక ముకేశ్ కి వర్షిణి బాగా క్లోజ్ కాబట్టి అతని అభిమానులు మొత్తం వర్షిణి కి ఓట్లు వేయొచ్చు. దీని వల్ల వర్షిణి సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆటో రామ్ ప్రసాద్ కి బలమైన ఓటు బ్యాంక్ ఉండడం తో ఆయన కూడా సేవ్ అవ్వొచ్చని , ఇక డేంజర్ జోన్ లోకి రోహిత్ బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి షాలిని , అమన్ లు వస్తారని, వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు విశ్లేషకులు. ఇదే కనుక జరిగితే రోహిత్ ఒక ట్రామా లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. నా స్నేహితులంతా ఎలిమినేట్ అవుతున్నారు , అసలు ఆడియన్స్ లో నా గేమ్ ఎలా వెళ్తుందో అర్థం కావడం లేదని డిప్రెషన్ లోకి రోహిత్ వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper