Homeఆంధ్రప్రదేశ్‌AP DSC 2026: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. లోకేష్ దూకుడు వైసీపీ ఆప...

AP DSC 2026: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. లోకేష్ దూకుడు వైసీపీ ఆప తరమా

AP DSC 2026: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. లోకేష్ దూకుడు వైసీపీ ఆప తరమాఏపీలో ఇటీవల ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. నిరుద్యోగుల కలలను సాకారం చేసింది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించి.. జీవితాలలో కొత్త వెలుగులు నింపింది. కానీ ఈ విషయాన్ని ఓర్చుకోలేక వైసీపీ నిప్పులు చిమ్మడం మొదలు పెట్టింది. ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడం ప్రారంభించింది. తద్వారా అనేక విధాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. కానీ ఇవేవీ కూడా నిలబడలేకపోయాయి. […]

AP DSC 2026: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. లోకేష్ దూకుడు వైసీపీ ఆప తరమాఏపీలో ఇటీవల ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. నిరుద్యోగుల కలలను సాకారం చేసింది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించి.. జీవితాలలో కొత్త వెలుగులు నింపింది. కానీ ఈ విషయాన్ని ఓర్చుకోలేక వైసీపీ నిప్పులు చిమ్మడం మొదలు పెట్టింది. ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడం ప్రారంభించింది. తద్వారా అనేక విధాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. కానీ ఇవేవీ కూడా నిలబడలేకపోయాయి. వాస్తవానికి పకడ్బందీగా ఆధారాలు కనుక వైసిపి దగ్గర ఉండి ఉంటే కచ్చితంగా న్యాయస్థానం దగ్గరికి వెళ్ళేది. అలా చేయకుండా ప్రజలలో లేనిపోని భయాలు సృష్టించే విధంగా.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించింది. కాని చివరికి న్యాయం గెలిచింది. వైసిపి విష ప్రచారం ఓడిపోయింది.

వైసిపి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ నిరుద్యోగుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ తర్వాత లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు ఆయన పచ్చ జెండా ఊపారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా డీఎస్సీ ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సంబంధించిన కీలక ప్రకటన చేశారు.

ఈ విడత నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2721 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో జెడ్పి.. ఎంపీపీ.. మున్సిపల్ పాఠశాలలకు సంబంధించిన ఎస్ ఏ, ఎస్జిటి పోస్టులతో పాటు.. స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలోని ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. వీటితోపాటు వివిధ గురుకుల విద్యాలయాల పరిధిలో ఉన్న సొసైటీలలోని ప్రిన్సిపాల్.. పిజిటి.. టీజీటీ. పిడి.. పీఈటి పోస్టల్ కూడా భర్తీ చేయబోతున్నారు. దరఖాస్తుకు సంబంధించిన ప్రక్రియ.. షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. నియామక ప్రక్రియలో భాగంగా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు.. అత్యంత పారదర్శకంగా.. వేగవంతంగా పూర్తి చేయాలని నారా లోకేష్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అభ్యర్థుల కోసం పరీక్ష విధానాన్ని.. సిలబస్ మొత్తాన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో కంప్యూటర్ ఆధారంగా అర్హత పరీక్షలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు కూడా మొదలుపెట్టారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం వరస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నది. అభ్యర్థులలో ఆనందోత్సాహాలను నింపుతున్నది. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా.. టైం ప్రకారం నియామకాలు పూర్తి చేస్తామని ఇప్పటికే నారా లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగపూట వెలువడిన టీచర్ ఉద్యోగుల ప్రకటన లక్షలాదిమంది డిఎస్సీ అభ్యర్థులకు నిజమైన కానుకలాగా నిలిచింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper