Homeఎంటర్టైన్మెంట్Viswanath And Sons Box Office: తమిళం కంటే తెలుగులో ఎక్కువ.. 'విశ్వనాధ్ & సన్స్'...

Viswanath And Sons Box Office: తమిళం కంటే తెలుగులో ఎక్కువ.. ‘విశ్వనాధ్ & సన్స్’ ఓపెనింగ్స్ ఇలా ఉంటాయని అసలు ఊహించలేదు!

Viswanath And Sons Box Office: తమిళ హీరో సూర్య కి తమిళనాడు లో కంటే మన తెలుగు లోనే ఎక్కువ క్రేజ్ ఉంది అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘గజినీ’ తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు తమిళం లో ఫ్లాప్ అయ్యినవి కూడా తెలుగు లో సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఒకానొక దశలో ఆయన టాలీవుడ్ లోనే స్థిరపడుతాడేమో అని అంతా అనుకున్నారు. సూర్య కి తెలుగు లో ఎంత క్రేజ్ ఉందో […]

Viswanath And Sons Box Office: తమిళ హీరో సూర్య కి తమిళనాడు లో కంటే మన తెలుగు లోనే ఎక్కువ క్రేజ్ ఉంది అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘గజినీ’ తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు తమిళం లో ఫ్లాప్ అయ్యినవి కూడా తెలుగు లో సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఒకానొక దశలో ఆయన టాలీవుడ్ లోనే స్థిరపడుతాడేమో అని అంతా అనుకున్నారు. సూర్య కి తెలుగు లో ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి నిన్న విడుదలైన ‘విశ్వనాధ్ & సన్స్’ మూవీ మొదటి రోజు వసూళ్లను చూస్తే అర్థం అవుతోంది. తమిళ రాష్ట్రాల్లో కంటే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ‘కరుప్పు’ హిట్ తో తమిళనాడు లో విజయ్ తర్వాత సూర్య నెంబర్ 1 స్థానాన్ని అధిరోహించబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అక్కడి ట్రేడ్ విశ్లేషకులు కూడా సూర్య నే తదుపరి నెంబర్ 1 హీరో అంటూ అభిప్రాయపడ్డారు. కానీ కట్ చేస్తే ‘కరుప్పు’ కి వచ్చిన ఓపెనింగ్స్ లో సగం కూడా ఈ చిత్రానికి తమిళనాడు లో రాలేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి రోజున తమిళనాడు నుండి 7 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక రాష్ట్రం నుండి ఈ చిత్రానికి 1 కోటి 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కేరళ నుండి 1 కోటి 55 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 25 లక్షలు , ఓవర్సీస్ నుండి 13 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 32 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 15 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 93 కోట్ల రూపాయలకు జరగ్గా, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కోసం ఈ చిత్రం ఇంకా 77 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోలిస్తే ఈ ఓపెనింగ్ వసూళ్లు చాలా తక్కువ అనే చెప్పాలి. ‘కరుప్పు’ తర్వాత విడుదల అవుతున్న సినిమా కాబట్టి , కచ్చితంగా ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ ని మొదటి రోజు రాబడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇంత తక్కువ వస్తుందని ఊహించలేదు. అయితే నేడు ఈ చిత్రానికి మొదటి రోజుకంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీకెండ్ పూర్తి అయ్యేసరికి 120 కోట్ల గ్రాస్ మార్కుని ఈ చిత్రం అందుకుంటుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper