V Hanumanth Rao: వి హనుమంతరావు.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఏది కూడా మొహమాటం లేకుండా ముఖం మీద మాట్లాడే వ్యక్తి. అందువల్లే కాంగ్రెస్ పార్టీలో ఆయనను భోళా శంకరుడు అని పిలుస్తుంటారు. ఎవరినైనా సరే ప్రేమతో పలకరిస్తారు. ఆ లింగనం చేసుకుంటారు. తప్పు చేస్తే మొహం మీద విమర్శిస్తారు.
హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. శనివారం స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ఆయన కామారెడ్డి లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇదే క్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాలలో విద్యార్థులు బంజారా ఆడపడుచుల వేషధారణలో అలరించారు. బంజారా పాటలు ప్లే అవుతుంటే.. లయబద్ధంగా డ్యాన్స్ లు వేశారు. పిల్లలు డాన్సులు వేస్తుంటే హనుమంతరావు కూడా ఊరుకోలేకపోయారు. వెంటనే వేదిక నుంచి కిందికి దిగి వచ్చారు. సాంస్కృతిక వేడుకలు జరిగే ప్రాంతానికి వెళ్లారు.
బంజారా పాటలకు విద్యార్థినిలు స్టెప్పులు వేస్తుంటే.. వారితోపాటు హనుమంతరావు కూడా డ్యాన్సులు వేశారు. చిన్న పిల్లాడి మాదిరిగా చేతులు ఊపుతూ ఆకట్టుకున్నారు. హనుమంతరావు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి..”హనుమంతరావు ఏం చేసినా సంచలనమే.. ఈ వయసులో కూడా విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేశారంటే ఆయన రేంజ్ మామూలుది కాదు. అసలు ఇంతటి ఉత్సాహం ఆయనకు ఎక్కడి నుంచి వస్తుంది. ఆయన ఏం తాగుతారు.. ఏం తింటారు.. గ్రేస్ అదిరిపోయింది. స్టెప్పు అదిరిపోయింది. ఇందిరాగాంధీ స్టేడియం మొత్తం ఊగిపోయింది. హనుమంతరావు అంటేనే మినిమం కాదు మాక్సిమం” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు..
ఇక ఇటీవల బోనాల వేడుకలు కూడా హనుమంతరావు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. సికింద్రాబాద్లో జరిగిన బోనాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసిన ఆయనకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువా కప్పి సన్మానించడానికి ప్రయత్నిస్తుండగా.. తోసి పుచ్చారు. ముందుగా దగ్గరికి రారా.. ఆ తర్వాత సన్మానం చేద్దువు గాని.. అటు హనుమంతరావు అనడంతో అక్కడ నవ్వులు విరిసాయి. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టేలా హనుమంతరావు చెబుతారని.. చివరికి తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో కూడా ఆయన వ్యక్తిగత సంబంధాలకే ప్రయారిటీ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
అదిరిపోయే స్టెప్పులేసిన వీహెచ్
కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో పాల్గొని విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసిన ప్రభుత్వ సలహాదారుడు హనుమంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు#Hanumantharao #Kamareddy #TV9telugu pic.twitter.com/oKI63o50ph
— TV9 Telugu (@TV9Telugu) August 15, 2026