Viswanath & Sons Twitter Talk: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం , మలయాళం భాషల్లో విడుదలైంది. ‘కరుప్పు’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత విడుదల అవుతున్న సినిమా కావడం తో , ఈ చిత్రం పై మొదటి నుండి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమాకు బిజినెస్ కూడా అదిరిపోయింది. ఇంతకు ముందు సూర్య కి ఎప్పుడూ జరగనంత బిజినెస్ ఈ సినిమాకు జరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. టీజర్ , ట్రైలర్ , పాటలు కూడా బాగా క్లిక్ అవ్వడం తో, ఈ సినిమా పై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి అంతటి పాజిటివ్ బజ్ ఏర్పడిన ఈ సినిమాకు ట్విటర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి వివరంగా చూద్దాం.
#VishwanathAndSons A Watchable, Clean Family Entertainer With a Good 1st Half but a Weak 2nd Half!
After a slow start, the first half feels refreshing and stays focused on the core plot with a good mix of fun and emotion. Just when you expect that flow to continue, the second…
— Venky Reviews (@venkyreviews) August 14, 2026
ట్విటర్ టాక్ ని బట్టీ చూస్తే ఫస్ట్ హాఫ్ కి ఆడియన్స్ నుండి తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది అనే చెప్పాలి. సినిమా మొదలైన 20 నిమిషాలు కొద్దిగా స్లో స్క్రీన్ ప్లే తో సాగినట్టు అనిపిస్తుంది కానీ , ఆ తర్వాత స్టోరీ లోకి ఎంట్రీ ఇచ్చాక మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా సాగిందని అంటున్నారు. అంతే కాకుండా ఈమధ్య కాలం లో విడుదలైన సినిమాల్లో , క్లీన్ కామెడీ ఈ చిత్రం లోనే ఉందని, అంతే కాకుండా ఎమోషనల్ మూమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ముఖ్యంగా సూర్య , మమిత బైజు , రాధికా పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉందని , డైలాగ్ రైటింగ్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ తో సెకండ్ హాఫ్ కాస్త తగ్గిందనే టాక్ నడుస్తోంది.
Ee year ippativaraku vacchina movies lo best idhi #VishwanathAndSons
— OG (@Tejuholicc2) August 14, 2026
సెకండ్ హాఫ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఎక్కువగా మెలోడ్రామా మీదనే ఫోకస్ పెట్టాడని , ఫన్ కూడా బాగా తగ్గిందని టాక్. అంతే కాకుండా క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదట. చివరి 30 నిమిషాలు ఇంకా కాస్త బాగా తీసుంటే , ఈ సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్లి ఆగేదో ఎవ్వరూ ఊహించని విధంగా ఉండేదని అంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ కాస్త తగ్గినప్పటికీ , ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చే అవకాశం ఉందని , ఓవరాల్ గా ఒక చక్కటి ఫ్యామిలీ డ్రామా , టైంపాస్ అయిపోతుందని అంటున్నారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ట్విటర్ లో నెటిజెన్స్ నుండి ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కి సంబంధించిన ట్వీట్స్ కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
#VishwanathAndSons First half – Excellent
– Took 15 Mins to setup the plot and Conflict !!
– Once #MamithaBaiju entered, the film took off and totally entered into the fun mode. Mamitha & her mannerisms was super cute
– #Suriya‘s Screen presence and performance was… pic.twitter.com/A4x9vB0HPn— AmuthaBharathi (@CinemaWithAB) August 14, 2026
#VishwanathAndSons First half – Excellent
– Took 15 Mins to setup the plot and Conflict !!
– Once #MamithaBaiju entered, the film took off and totally entered into the fun mode. Mamitha & her mannerisms was super cute
– #Suriya‘s Screen presence and performance was… pic.twitter.com/A4x9vB0HPn— AmuthaBharathi (@CinemaWithAB) August 14, 2026
One of the best theatrical watches in recent times #VishwanathandSons
— Power 31 (@Powerstorm21) August 14, 2026