Venky Atluri: సూర్య హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా విశేషమైన ఆదరణను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. వెంకీ అట్లూరి ఈ సినిమా కథని కొన్ని రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీసినట్టుగా తెలుస్తుంది. తను చిన్నతనంలో ఉనప్పుడు తను చూసిన కొంతమంది జనాలను అలాగే తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన మరికొందరిని చూసి ఈ కథనైతే రెడీ చేసుకున్నాడట. ఇక ఏది ఏమైనా కూడా ఈ కథని నిజజీవితం లోని కొన్ని ఎలిమెంట్స్ ని కలుపుకొని రాశారు.
కాబట్టి ఈ మూవీ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబడుతుంది. ఈ మూవీతో ఆయన భారీ సక్సెస్ ను నమోదు చేసుకున్నాడు. తొందర్లోనే ఆయన మరిన్ని సక్సెస్ లను సాధించి టాప్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. వరుసగా ఇతర భాషల హీరోలతో సినిమాలను చేస్తూ వాళ్ళకి సక్సెస్ లను అందించాడు.
ఇక ఇప్పుడు ఆయన తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వెంకీ అట్లూరి ధనుష్ తో సార్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, సూర్యతో విశ్వనాధ్ అండ్ సన్ సినిమాలు చేసి వాళ్లకి సక్సెస్ లను అందించాడు.
ఈ మూవీస్ తో వెంకీ అట్లూరి టాప్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం…విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ లాంగ్ రన్ లో ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది. సూర్య తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా మారుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వస్తుంది. ఈ వీక్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు…