Viswanath And Sons: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు సూర్య…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుండటం విశేషం… ఇకమీదట కూడా తను చేయబోయే సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా చూసుకున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్లో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో తనున్నాడు. ఈ సినిమా నిన్న రిలీజైంది. అయితే ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. సినిమా ఫస్టాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని సెకండాఫ్ కొంతవరకు తగ్గింది అంటు కొన్ని కామెంట్లయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమా సెకండాఫ్ అత్తారింటికి దారేది సినిమా పాటర్న్ లో నడుస్తుంది. దానివల్ల చాలామంది ప్రేక్షకులు సినిమాలోని కోర్ ఎమోషన్ ని కొంతవరకు ఫీల్ అవ్వలేకపోయారనే ఒక భావన కలుగుతుంది.
ఈ సినిమా కథని వెంకీ రాసుకున్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఈ కథకి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడట. సెకండాఫ్ లో సినిమా అత్తారింటికి దారేది ఫ్లేవర్ లో ఉండడానికి గల కారణం ఏంటంటే త్రివిక్రమ్ చెప్పిన కొన్ని సీన్లు దానికి తగ్గట్టుగా వెంకీ అట్లూరి రాసుకున్న కొన్ని స్క్రీన్ ప్లే టెక్నిక్స్ కారణమని చెబుతున్నారు.
దానికి తగ్గట్టుగానే ఒక సినిమా వస్తుందంటే చాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమా కథను విని సినిమా మొత్తం పూర్తి అయిన తర్వాత ఆ మూవీ ని చూసి అందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా లేదా అనే ధోరణిలో కూడా ఆయన కథను జడ్జ్ చేస్తూ వాటికి సంబంధించిన కొన్ని ప్యాచ్ వర్క్ లను కూడా పెట్టుకోమని చెబుతాడు.
ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ అవుతుంది. సితార బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాల విషయంలో ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువైపోతుందని అంటున్నారు. సితార బ్యానర్ లో సినిమా చేయాలంటే మాత్రం త్రివిక్రమ్ కి తప్పకుండా కథ చెప్పాల్సిందే అలాగే ఆయన చెప్పిన చేంజెస్ చేయకపోతే సినిమా పట్టలెక్కదట…