Homeఎంటర్టైన్మెంట్Viswanath and Sons Movie Review : ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ రివ్యూ :...

Viswanath and Sons Movie Review : ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ రివ్యూ : త్రివిక్రమ్ స్టైల్ సినిమా!

Viswanath and Sons Movie Review : నటీనటులు: సూర్య, మమితా బైజు, రవీనా టాండన్, రాధిక, సునీల్ రెడ్డి, నాజర్, సర్వదమన్ బెనర్జీ తదితరులు సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి ఎడిటర్: నవీన్ నూలి దర్శకత్వం: వెంకీ అట్లూరి నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సర్,లక్కీ భాస్కర్ లాంటి హిట్ సినిమాలతో జోరుమీదున్న దర్శకుడు వెంకీ అట్లూరి, తమిళ స్టార్ హీరో సూర్య తో సినిమా అనగానే […]

Viswanath and Sons Movie Review : నటీనటులు: సూర్య, మమితా బైజు, రవీనా టాండన్, రాధిక, సునీల్ రెడ్డి, నాజర్, సర్వదమన్ బెనర్జీ తదితరులు

సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి

ఎడిటర్: నవీన్ నూలి

దర్శకత్వం: వెంకీ అట్లూరి

నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

సర్,లక్కీ భాస్కర్ లాంటి హిట్ సినిమాలతో జోరుమీదున్న దర్శకుడు వెంకీ అట్లూరి, తమిళ స్టార్ హీరో సూర్య తో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సౌత్ లో లేటెస్ట్ సెన్సేషన్ అయిన మమిత బైజు హీరోయిన్ గా నటించడం, ట్రైలర్ లోనే హీరో, హీరోయిన్ ల మధ్య 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ లవ్ అంటూ హింట్ ఇవ్వడం.. ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈరోజే విడుదల కాబట్టి వెంకీ అట్లూరి బాక్స్ ఆఫీస్ దగ్గర మరో విజయాన్ని నమోదు చేశాడా? కరుప్పు(తెలుగులో వీరభద్రుడు) సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన సూర్యకు ఈ విశ్వనాథ్ & సన్స్ మరో హిట్ ఇచ్చిందా అనేది రివ్యూ లో చూద్దాం.

సంజయ్ విశ్వనాథ్ (సూర్య) మల్టీ టాలెంటెడ్. ఒకవైపు విజయవంతమైన బిజినెస్ మేన్ గా రాణిస్తూనే, మరోవైపు షూటింగ్ విభాగంలో భారతదేశం తరఫున ఒలింపిక్ మెడల్ కూడా సాధిస్తాడు. ప్రొఫెషన్లు అన్నీ బాగానే ఉంటాయి కానీ మన హీరోకు పెళ్లి అంటే మంచి ఒపీనియన్ ఉండదు. పెళ్లి మాట తప్ప ఇంకేదైనా సరే మాట్లాడతాడు. కానీ ఎవరింట్లో అయినా అమ్మలకు నచ్చని ఓకే ఒక్క టాపిక్.. వయసొచ్చిన కొడుకు పెళ్లి చేసుకో…ను అని పట్టు పట్టడం. సరిగ్గా అలాగే సంజయ్ తల్లి నిర్మల(రాధిక శరత్ కుమార్) కు అదె సమస్య. దీంతో నలభైల్లో ఉన్న కొడుక్కి ఎలాగైన పెళ్లి చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. వారసుడు లేడు అని బాధపడుతూ ఉంటుంది. సాధారణంగా అయితే ఒప్పుకోడు కానీ ఒకానొక సందర్భంలో అమ్మ వైపు ఆలోచించి పెళ్ళీగిళ్ళీ లేకుండా సరోగసీ ద్వారా కొడుకుని కంటాడు. మనవడిని తీసుకొచ్చి నిర్మల చేతిలో పెడతాడు. ఇక్కడి వరకూ అంతా సాఫీగానే సాగుతుంది. అప్పుడు సంజయ్ కుటుంబంలో ఒక సమస్య రావడం, మ్యాడీ (మమిత బైజు) ఎంట్రీ ఇవ్వడంతో సూర్య లైఫ్ మలుపులు తిరుగుతుంది. అసలు మ్యాడీ ఎవరు? సంజయ్ లైఫ్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? చివరికి ఏమైంది అనేది మిగతా కథ.

సరోగసీ కాన్సెప్ట్ మీద ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి కానీ దాన్నే కొత్త కోణంలో ప్రెజెంట్ చేసి కమర్షియల్ హంగులు జోడించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. సరోగసీ నేపథ్యంతో పాటు హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ కూడా సినిమా కథలో ముఖ్యమైన ఎలిమెంట్. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ కథ నడిపించాడు. హీరో పాత్ర ను టిపికల్ తెలుగు స్టార్ హీరో స్టైల్ లో ప్రెజెంట్ చేసి, అతని విజయాలు, సమాజంలో హోదా ఇవన్నీ చూపించి ఎలివేషన్ ఇచ్చి రొటీన్ ఫీల్ తెప్పించినా ఒక్కసారి సరోగసీ ద్వారా బిడ్డను కానీ తీసుకురావడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక హీరోయిన్ మమిత బైజు ఎంట్రీతో స్క్రీన్ పై పండగ వాతావరణం నెలకొంటుంది. డిగ్నిఫైడ్ గా, జెంటిల్ మేన్ లాగా ఉండే సూర్య పాత్రకు పూర్తి రివర్స్ లో మమిత చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో సబ్ ప్లాట్ ల వల్ల, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ వల్ల అర్థగంట పాటు కాస్త వీక్ అయినట్టు అనిపించినా, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ను అర్థవంతంగా, మెచ్యూర్డ్ గా డీల్ చేయడంతో ప్రేక్షకులకు మంచి అనుభూతినే మిగిలిస్తుంది విశ్వనాథ్ & సన్స్.

సెకండ్ హాఫ్ కొంత భాగం మినహాయిస్తే సినిమా అంతా ఎంగేజింగ్ గా నడిపాడు దర్శకుడు. ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైలాగుల్లో డెప్త్ తో పాటుగా ఫన్ టోన్ సరిగ్గా కుదిరింది. “కోపం, ద్వేషం కూడా కొంత కాలానికి అల‌సిపోతాయి” లాంటి కొటేషన్ స్టైల్ డైలాగులు ప్రేక్షకులకు చాలారోజులు గుర్తుండిపోతాయి. ఇలాంటి డైలాగులు విన్నప్పుడు చటుక్కున మాటల మాంత్రికుడు కూడా గుర్తు రావొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కూడా సినిమాకు తగ్గట్టు బాగుంది. పాటలు కూడా డీసెంట్ గా ఉన్నాయి.

మెచ్యూర్డ్ గా జెంటిల్ మేన్ తరహాలో ఉండే పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. తల్లి పాత్రలో రాధిక, సూర్య బావ పాత్రలో సునీల్ రెడ్డి, హీరోయిన్ మమిత అక్కడక్కడా వచ్చే ఫన్ డైలాగ్స్ తో నవ్వించారు. ఎమోషనల్ సన్నివేశాలు తప్ప మిగతా సినిమా అంతా ఫన్ టోన్ లోనే సరదాగా సాగింది. ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో సూర్య, రాధిక, మమితా చాలా బాగా నటించారు.

సినిమాపూర్తిగా క్లీన్ అని చెప్పలేం.. ఎందుకంటే సరోగసీకి సమబంధించిన డైలాగులు, ఇక బ్యాంకాక్ స్టైల్ కొన్ని డైలాగులు ఉన్నాయి కానీ ఎక్కడా పరిధి మాత్రం దాటలేదు. బహుశా అందుకే (U/A) రేటింగ్ ఇచ్చినట్టున్నారు. అది పెద్ద ఇబ్బంది కానే కాదు.. నెట్ ఫ్లిక్స్ బంచిక్ బమ్ లతో పోలిస్తే ఇవి జుజుబీ అని అభిప్రాయం ఉన్నవారు ఇంటిల్లిపాదీ కలిసి హాయిగా చూడదగ్గ సినిమా.

సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?

1. మమితా బైజు, సూర్య, రాధికల నటన

2. డైలాగ్స్, క్లైమాక్స్ ఎపిసోడ్

3. సిట్యుయేషనల్ కామెడీ

సినిమాలో బాగలేనివి ఇవి:

1. సెకండాఫ్‌ లో కొంత వీక్ పోర్షన్

2. రొటీన్ ఫ్యామిలీ డ్రామా అనిపించే కొన్ని సీన్స్

రేటింగ్: 2.75/5

ఫైనల్ వర్డ్: ఒక్క ముక్కలో అంటే త్రివిక్రమ్ స్టైల్ సినిమా అని చెప్పాలి. నాలుగు ముక్కల్లో అంటే – పేద్ద రిచ్ ఫ్యామిలీ, లంకంత కొంప, తెర నిండా ఆర్టిస్టులు, కొన్ని నవ్వులు, సందుదొరికితే ఫిలాసఫీలు, సందు దొరికిన దొరకాకపోయినా వచ్చే ఫైట్లు, ఫీల్ గుడ్ క్లైమాక్స్. నాలుగు ముక్కలు కాదు ఎనిమిది ముక్కలు అయిపోయాయి.. షబ్బఖైర్!

Ramu Kovuru
Ramu Kovuruhttps://oktelugu.com/
Ramu Kovuru is a writer having 10 plus years of experience. He has worked for websites writing movies content. He is also woriking in Telugu film industry as a writer for the past 5 years. He has good knowledge in cinema across the languages. He contributes to movie reviews.

Related News

Most Popular

Oktelugu Epaper