Viswanath And Sons: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మన హీరోలు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక స్టార్ హీరోలందరు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే చిన్న హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు సూర్య…ఆయనకి తమిళ తోపాటు తెలుగులో కూడా చాలా మంచి మార్కెట్ ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను విపరీతంగా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద భారీ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందంటూ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు… ఇక దీంతోపాటుగా విశాల్ హీరోగా వస్తున్న ‘మకుటం’ సినిమా కూడా రేపు రిలీజ్ అవ్వబోతుంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ తో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సినిమా ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయకపోవడంతో సినిమా మీద హైప్ లేకుండా రిలీజ్ అవుతుంది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు నాగార్జున నిర్మిస్తున్న ‘పళ్ళ బురుసు’ అనే ఒక తెలంగాణ నేపథ్యంలో సాగిన తండ్రీ కొడుకుల కథతో వస్తున్న ఈ సినిమా కూడా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…
ఒకప్పుడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ‘అగధ’ అనే సినిమా తెరికెక్కింది. ఈ సినిమా సైతం రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హార్రర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుడిని ఎంతవరకు మెప్పిస్తుందనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ లో సన్నీ డియోల్ హీరోగా చేస్తున్న బట్వారా మూవీ కూడా రేపు రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందనేది తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే రేపు రిలీజ్ అయ్యే అన్ని సినిమాల్లో ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా మాత్రమే మంచి హైప్ తో రిలీజ్ అవుతుంది.
కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వీకెండ్ లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తుండటం విశేషం…