Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఈ సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలుగుతున్న స్టార్ హీరోలందరు వాళ్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న సందీప్ రెడ్డివంగా ప్రొడ్యూసర్ గా మారి కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు.
ముఖ్యంగా అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలకి సందీప్ రెడ్డి వంగ వాళ్ల అన్నయ్య ప్రణయ్ రెడ్డి ప్రొడ్యూసర్ అనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ‘రోమాంచకం’ అనే సినిమాని సైతం వాళ్ళ బ్యానర్ నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక స్టార్ హీరో తో సందీప్ వంగ ప్రొడ్యూసర్ గా సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే నాగచైతన్య హీరోగా సందీప్ రెడ్డివంగ వాళ్ల బ్యానర్ లో ఒక సినిమా అయితే రాబోతుందట. ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించబోతున్నారనే విషయంలో క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాతో నాగచైతన్యకు ఒక మంచి సక్సెస్ ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డివంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఒకరకంగా చెప్పాలంటే సందీప్ రెడ్డి రాసిన కథతో అతని శిష్యుడిని ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే మాత్రం అటు సందీప్ రెడ్డివంగ కానీ ఇటు నాగచైతన్య కానీ స్పందించాల్సిన అవసరమైతే ఉంది…