YouTube vs Netflix: వ్యాపారంలో ఒకరికొకరి మధ్య పోటీ ఉండడం సహజం. ఎవరు ఎక్కువగా డబ్బు సంపాదిస్తారో? ఎవరు ఎక్కువగా సేల్స్ చేస్తారో.. వారినే విన్నర్ గా పరిగణించేవారు.. కానీ ఇప్పుడు ఆన్లైన్ సంస్థల మధ్య కూడా పోటీ నెలకొంది. అయితే ఈ పోటీ కేవలం డబ్బు కోసం కాకుండా ప్రేక్షకులు, క్రియేటర్ల కోసం కావడం గమనార్హం. ప్రముఖ ఆన్లైన్ సంస్థలైన యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఈ పోటీలో ముఖ్యులుగా నిలుస్తున్నాయి. ఓ షో విషయంలో క్రియేటర్ల కోసం ఈ రెండు కంపెనీలు పోటీ పడడం విశేషం. ఇంతకీ ఈ రెండు సంస్థల మధ్య పోటీ ఎందుకు ఏర్పడింది? అసలు ఏంటి కథ..?
యూట్యూబ్లో చిన్న స్థాయి నుంచి టాప్ లెవల్ లోకి వెళ్లినవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పటివరకు మీరు తమ క్రియేటివిటీని ఉపయోగించి యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని పొందారు. కానీ ఇప్పుడు ఈ క్రియేటర్ల కోసం రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి. Samay Raina కు చెందిన India’s got latent సీజన్ వన్ ఇప్పటికే యూట్యూబ్ ద్వారా ప్రజా ధారణ పొందిన విషయం తెలిసిందే. దీని ద్వారా అధిక ఆదాయాన్ని కూడా పొందింది.. ఆ తర్వాత ఈ షో ను నెట్ఫ్లిక్స్ కూడా ప్రసారం చేసింది.
కానీ ఇప్పుడు లేటెస్ట్ గా రాబోయే సీజన్ 2 కోసం రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా యూట్యూబ్ తన టాప్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న క్రియేటర్లకు మిలియన్ డాలర్ల డబ్బులు ఇచ్చి ఈ షోలో ఉండేలా చూసుకుంటున్నాయి. అయితే యూట్యూబ్లో ఇప్పటికే టాప్ లెవల్ లో ఉన్న క్రియేటర్ లను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేస్తుండగా.. వారిని వెళ్ళనీయకుండా యూట్యూబ్ కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా వీరికి ప్రత్యేకంగా ప్యాకేజీ అని ప్రకటిస్తోంది. ప్యాకేజీ మాత్రమే కాకుండా వివిధ రకాల బ్రాండ్ల ద్వారా వచ్చి వాటిలో షేర్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే అటు నెట్ఫ్లిక్స్ సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే టాప్ లెవల్ లో ఉన్న క్రియేటర్లు నెట్ఫ్లిక్స్ లో కనిపిస్తున్నారు. మరికొందరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కానీ ఆదాయం పరంగా చూస్తే గతంలో ప్రసారమైన ఆల్ఫాబెట్ ప్రకారం India’s latent show ద్వారా నెట్ఫ్లిక్స్ కంటే యూట్యూబ్ కి ఎక్కువ ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. 2025 లో ఈ షో ద్వారా యూట్యూబ్ కు 65 బిలియన్ల ఆదాయం రాగా.. నెట్ ఫ్లిక్స్ కు 45 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. కానీ ఆదాయం కంటే ప్రేక్షకులను, క్రియేటర్ లను దక్కించుకోవడమే అసలైన గెలుపు అని ఈ రెండు సంస్థలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా థియేటర్ల కోసం రెండిటి మధ్య తీవ్రవార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ క్రియేటర్లు అసలైన కంటెంట్లను తయారుచేసి ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే భవిష్యత్తులో యూట్యూబ్ మంచి రోజులు ఉన్నాయని కొందరు అంటున్నారు.