Ambati Rambabu Health: అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. హైదరాబాదులో ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఆయన గుండెకు రెండు స్టంట్ లు కూడా వేశారు. సాధారణ ఆరోగ్య తనిఖీలకు వెళ్లిన అంబటి రాంబాబుకు స్టంట్సు అవసరమని గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు వైద్యులు. అయితే ఈ విషయం బయటకు రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అంబటి ఆరోగ్యం పై చర్చ నడిచింది. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ తరుణంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబును ఫోన్లో పరామర్శించారు. అయితే నేరుగా వెళ్లి పరామర్శిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఫోన్లోనే పరామర్శించారు.
* రెండు స్టంట్ లు..
గుంటూరులో ఉండగా అంబటి రాంబాబు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉండడంతో కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆయనకు స్టంట్ అవసరం అని వైద్యులు చెప్పారు. దీంతో గుండెల్లో రెండు చోట్ల స్టంట్సు వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులెటిన్ జారీ చేశారు. ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అయిందని.. హైదరాబాద్ ఎవరు రావొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తారని ప్రకటించారు.
* ఫోన్లో పరామర్శ..
మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్నారని తెలిసి జగన్ స్వయంగా హైదరాబాద్ వెళుతున్నారని ప్రచారం నడిచింది. కానీ జగన్ ఫోన్ పరామర్శకి పరిమితం అయ్యారు. అంబటి రాంబాబు తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు స్టంట్ వేసుకున్న అంబటి రాంబాబు సాధారణ స్థితిలోకి వచ్చారు. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు డిస్చార్జ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అంబటి రాంబాబు తో జగన్ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
View this post on Instagram