Spirit Movie ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా ప్రస్తుతం పెద్ద ఎత్తున భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటివరకు ప్రభాస్ ని ఎవ్వరు చూడని విధంగా సందీప్ రెడ్డివంగా చూపిస్తుండటం విశేషం… ప్రస్తుతం ప్రతి హీరో అభిమాని కూడా స్పిరిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఏదేమైనా కూడా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ఈ సినిమాలో ప్రభాస్ డూప్ లేకుండా ఒరిజినల్ గా చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ రెడ్డివంగా వాళ్ళ అన్నయ్య అయిన ప్రణయ్ రెడ్డి తెలియజేశాడు. తను కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. కాబట్టి సందీప్ ముందుగానే ప్రభాస్ కి ఒక కండిషన్ పెట్టడట. ఇందులో డూపులను వాడకూడదని చెప్పడంతో ప్రభాస్ ఎంత రిస్క్ అయినా సరే తనే చేస్తానని చెప్పాడు.
అలా అయితే ఔట్ పుట్ కూడా అద్భుతంగా వస్తుందని తను కూడా నిర్ణయించుకున్నారట. ఇక ఏదేమైనా కూడా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక సందీప్ రెడ్డి వంగా గతంలో చేసిన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి, అనిమల్ లాంటి సినిమాలు అతని కెరియర్లో అద్భుతమైన సినిమాలు గా నిలవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని అమాంతం ముందుకు తీసుకెళ్లాయి.
బోల్డ్ కంటెంట్ తో కూడా భారీ విజయాలను సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఇప్పటి వరకు సందీప్ చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఏ రేంజ్ సక్సస్ ను సాధిస్తాడనేది తెలియాల్సి ఉంది.