Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీNASA Mars Mission: మార్స్ పై మనుషులున్నారా? ఇవి ఎవరు చెక్కారు? షాకింగ్ వీడియో

NASA Mars Mission: మార్స్ పై మనుషులున్నారా? ఇవి ఎవరు చెక్కారు? షాకింగ్ వీడియో

NASA Mars Mission: మనభూమి చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతూ ఉంటాయని సైన్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటున్నాం. అయితే ఇందులో కొన్ని గ్రహాలు మనసులు జీవించడానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందా? అనే పరిశోధనలు చేయడానికి నేరుగా గ్రహాలకు వెళ్లడమే కాకుండా మరికొన్ని గ్రహాలకు ప్రత్యేకంగా ఉపగ్రహాలను పంపుతున్నారు. ఇందులో భాగంగా National Aeronautic and Space Administrative (NASA) అంగారక గ్రహంపై ఉపగ్రహాలను పంపి అక్కడి వాతావరణాన్ని పరిశీలిస్తుంది. అయితే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన […]

NASA Mars Mission: మనభూమి చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతూ ఉంటాయని సైన్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటున్నాం. అయితే ఇందులో కొన్ని గ్రహాలు మనసులు జీవించడానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందా? అనే పరిశోధనలు చేయడానికి నేరుగా గ్రహాలకు వెళ్లడమే కాకుండా మరికొన్ని గ్రహాలకు ప్రత్యేకంగా ఉపగ్రహాలను పంపుతున్నారు. ఇందులో భాగంగా National Aeronautic and Space Administrative (NASA) అంగారక గ్రహంపై ఉపగ్రహాలను పంపి అక్కడి వాతావరణాన్ని పరిశీలిస్తుంది. అయితే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వీడియోను చూస్తే.. అక్కడ కొన్ని అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. వీటి ప్రకారం ఇక్కడ ఇప్పటికే మనుషులు జీవించారా? అన్న చర్చ సాగుతోంది. గతంలోనూ ఇక్కడ వినాయకుడి విగ్రహం కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఇలాంటి దృశ్యాలు కనిపించాయంటే?

భూమి నుంచి అంగారక గ్రహం 22.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఎంతో దూరం అయినప్పటికీ దీనిపై పరిశోధనలు చేయడానికి అనుకూలంగా ఉండడంతో నాసా ఇప్పటికే పలు రకాల ఉపగ్రహాలను పంపింది. అక్కడి ఉపగ్రహాలు తీసిన ఫోటోలు, వీడియోలను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ఈ వీడియోలను బట్టి చూస్తే ఇక్కడ ఎక్కువగా రాళ్లు, రప్పలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మొత్తం ఎర్రటి భూమి కనిపిస్తోంది. ఇక్కడి వాతావరణం చల్లగా ఉండడంతో పాటు ఎక్కువగా గాలి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వీడియో ప్రకారం కనిపించే రాళ్లు, చెదిరిపోయిన స్థలాలను చూస్తే అంగారక గ్రహానికి చరిత్ర ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు. అలాగే ఇక్కడ కొన్ని ఆకారాలు కూడా కనిపించడం వల్ల ఇక్కడ మనుషులు కూడా నివసించారా ? అని అనుకుంటున్నారు. అంతేకాకుండా కొన్నిచోట్ల గుంతలు పడి ఉండడంతో పాటు.. భూకంపం వచ్చిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి.

అయితే అంగారక గ్రహంలో గతంలో మనుషులు జీవించారా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కనిపించే కొన్ని ఆకారాలను మనుషులు తప్ప ఎవరూ చెక్కలేరు. గతంలో ఇక్కడ వినాయకుడి విగ్రహం కనిపించడంతో ఒకప్పుడు ఇక్కడ దేవాలయం ఉండేదని భావించారు. ఇప్పుడు తాజాగా తీసిన ఫోటోలు, వీడియోలను బట్టి చూస్తే మరిన్ని షాకింగ్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అంగారక గ్రహం భూమికి ఎంతో దూరం ఉన్నప్పటికీ అక్కడ నుంచి ఇక్కడికి మనుషులు ఎలా వచ్చారు? లేదా ఇక్కడ ఈ రాతి బొమ్మలను ఎవరు చెప్పారు? అని అన్వేషిస్తున్నారు.

అంగారక గ్రహం చూడడానికి ఎర్రగా కనిపిస్తున్నప్పటికీ.. ఇక్కడ మనుషులు జీవించడానికి అనువైన వాతావరణముండే పరిస్థితులు ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు. అయితే అప్పుడే పూర్తి నిర్ధారణకు రాలేమని అంటున్నారు. కానీ భూమికి, అంగారక గ్రహానికి దగ్గర సంబంధం ఉన్నట్లు చెబుతున్నారు. నాసా మరిన్ని పరిశోధనలు చేసి అసలైన వివరాలను రాబట్టే ప్రయత్నాలు చేస్తుందని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper