Sandeep Reddy Vanga: సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కడడానికి చాలామంది దర్శకులు కారణమవుతున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డివంగా ఆ తర్వాత చేసిన సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు అంటూ ప్రభాస్ అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ‘రోమంచకం’ అనే సినిమాను వాళ్ళ బ్యానర్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ లో సందీప్ రెడ్డివంగా పాల్గొన్నారు. ఇక ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ ను రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగాడు. గతంలో ఒక ఇంటర్వ్యూ లో మీరు మీ అన్నయ్య అయిన ప్రణయ్ రెడ్డి వైపు చాలా సీరియస్ గా చూసారని అలా ఎందుకు చూశారు.
అప్పటి నుంచి ఆ వీడియో ను మీమర్స్ మీమ్స్ కోసం వస్తున్నారు అని అడిగాడు. దాంతో సందీప్ రెడ్డివంగా క్లారిటి ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అక్కడ సౌండ్ సరిగా రికార్డు అవ్వడం లేదని ఫ్యాన్ ఆపేశారు. నా కుర్తా మొత్తం తడిసిపోయింది. అందుకే అటు వైపు చూశాను అంతే తప్ప మా అన్నయ్య అంటే నాకు చాలా భయం, ఆయన నాకంటే చాలా పెద్దవాడు అతన్ని కోపంగా సీరియస్ గా ఎందుకు చూస్తాను అంటూ సందీప్ ఆ సిచువేషన్ కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో మరొకరు ఉండరు అనేది వాస్తవం… ఆయన చేసిన సినిమాలు పాన్ ఇండియా నేపథ్యంలో అలాగే పాన్ వరల్డ్ లో కూడా తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది…