ప్రజలు, రాజకీయం తప్ప సినిమాల మీద ప్రేమనే ఉండదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు.. కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించిన పెద్ద మనిషి జనసేనాని.. ఆయనకు ట్విట్టర్ , ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలున్నా.. ప్రజలకు పిలుపునివ్వడానికి.. రాజకీయానికి తప్పితే ఒక్కసారి కూడా సినిమాలకు వాడుకోని మహా నాయకుడు పవర్ స్టార్. అయితే తొలిసారి ఆయన వెనక్కి తగ్గాడు. నిర్మాతలు, దర్శకుడి కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి బయటకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఎప్పుడు చూడాలని ఎవ్వరిని అడగడు.. ప్రోత్సహించడు. రాజకీయాలపై న్యూస్ ఛానెల్స్ కు మినహా మీడియా ఇంటర్వ్యూలు అస్సలే ఇవ్వడు. సినిమాలో నటించి దులుపుకుంటాడు తప్పితే అస్సలు ఆ సినిమా చూడాలని బాగుందని ప్రమోషన్లలో పాల్గొనడు. చూస్తే చూడండి.. ఆడితే ఆడింది అని నిర్మాతకే వదిలేస్తాడు.
కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ మారిపోయాడు. అందరు హీరోల్లా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేయమని దిల్ రాజు కోరినట్లు సమాచారం. భారీ బడ్జెట్ మూవీ కావడం.. రీఎంట్రీ ఫిల్మ్ కావడంతో పవన్ కళ్యాణ్ తొలిసారి తన సినిమాలకు ప్రమోషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది.
తాజాగా పవన్ కళ్యాణ్ ఆమోదించిన కొన్ని ప్రశ్నలతో ఓ ఫిమేల్ యాంకర్ తో ఇంటర్వ్యూను ఇవ్వడానికి ఒప్పుకున్నాడట.. జస్ట్ గంటలో ఈ ఇంటర్వ్యూను పూర్తి చేశారు. వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి తాజాగా డబ్బింగ్ చెప్పడానికి పవన్ రాగా.. అదే ఊపులో ఆయనతో గ్యాప్ లో ఓ గంటలో ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడట నిర్మాత దిల్ రాజు.
సినిమా రిలీజ్ అయ్యే ఏప్రిల్ 9కు పవన్ ఎక్కడుంటాడో.. తిరుపతి ప్రచారానికి వెళతాడో తెలియదు కాబట్టి ఎందుకైనా మంచిదని ముందుగానే పవన్ డబ్బింగ్ కు రావడంతో ఆ గ్యాప్ లో కాగల కార్యాన్ని దిల్ రాజు పూర్తి చేశాడట.. ఎంతైనా దిల్ రాజుది బుర్రే బుర్ర అని పవన్ తో తనకు ఏం కావాలో ముందుగానే ఊహించి తీసుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More