Homeఎంటర్టైన్మెంట్Sukumar And Dil Raju: దిల్ రాజు కాళ్లు పట్టుకున్న సుకుమార్... సినిమా కోసం అలా...

Sukumar And Dil Raju: దిల్ రాజు కాళ్లు పట్టుకున్న సుకుమార్… సినిమా కోసం అలా కూడా చేస్తాడా…

Sukumar And Dil Raju: ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ లాంటి దర్శకుడు తన కెరియర్ మొదట్లో డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించాడు. మొదటి సినిమా ఆర్య తోనే ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. తనకంటూ ఒక గొప్ప గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాంటి సుకుమార్ ఆర్య సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడు. దిల్ రాజుకి నేరేషన్ ఇస్తూనే ఇందులో హీరోగా […]

Sukumar And Dil Raju: ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ లాంటి దర్శకుడు తన కెరియర్ మొదట్లో డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించాడు. మొదటి సినిమా ఆర్య తోనే ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. తనకంటూ ఒక గొప్ప గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాంటి సుకుమార్ ఆర్య సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడు. దిల్ రాజుకి నేరేషన్ ఇస్తూనే ఇందులో హీరోగా ఎవరిని తీసుకోవాలనే దాని మీద కూడా చాలా వరకు కసరత్తులు చేశాడు. మొత్తానికైతే అల్లు అర్జున్ ను హీరోగా తీసుకొని ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాడు. నిజానికి ఈ సినిమాలో ఒక మాంటేజ్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి దిల్ రాజు తన దగ్గర బడ్జెట్ లేదు అనుకున్న బడ్జెట్ మొత్తం అయిపోయింది సినిమాని రిలీజ్ చేసేయండి అని చెప్పారట. కానీ సుకుమార్ మాత్రం ఆ మాంటేజ్ లేకపోతే సినిమా నడవదని అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించలేమని దిల్ రాజును బతిమిలాడుకున్నాడట.

అయిన కూడా దిల్ రాజు వినకపోవడంతో తన కాళ్ల మీద పడి మరీ సినిమాను మనం సక్సెస్ చెయ్యాలంటే మీరు తప్పకుండా ఆ మాంటెజ్ సన్నివేశం ఉండేలా చూడాలి. దాని కోసం డబ్బులు అరెంజ్ చేయండి సన్నివేశాన్ని చిత్రీకరిద్దామని చెప్పారట.

దానికి దిల్ రాజు సైతం ఓకే అనడంతో మొత్తానికైతే సినిమా లాస్ట్ లో వచ్చే మాంటేజ్ ను చిత్రీకరించి సినిమాలో ఆడ చేసి రిలీజ్ చేశారు. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. దాంతో దిల్ రాజుకి భారీ డబ్బులైతే వచ్చాయి…

నిజానికి సుకుమార్ అనే కాదు కొత్తగా దర్శకత్వం చేసే ఏ డైరెక్టర్ అయినా కూడా తన సినిమా బాగా రావాలని దాని వల్ల అతనికి మంచి పేరు రావాలని చూసుకుంటాడు. అందువల్లే ప్రొడ్యూసర్స్ కాళ్ళ మీద పడడానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పడానికి సుకుమార్ ఈ సంఘటనను ఎగ్జాంపుల్ గా చెప్పాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper