Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ వాళ్ళను స్టార్లుగా చేయడానికి దర్శకులు ఎంతలా కష్టపడతారనే విషయం ఎవ్వరు పట్టించుకోరు. ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం హీరోకి వెళ్తుంది. ఒక సినిమా ప్లాప్ అయితే మాత్రం దర్శకుడి వల్లే సినిమా ఫ్లాప్ అయింది అంటూ అతన్ని నిందిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రొడ్యూసర్లు సైతం ఒక సినిమా మీద ఎంత బడ్జెట్ ని కేటాయించాలి, ఎలా చేస్తే సినిమా సక్సెస్ అవుతుంది. సినిమాకి భారీ లాభాలు రావాలంటే ఎలాంటి స్ట్రాటజీలను వాడాలి అనే ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ సైతం ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన మంచి సబ్జెక్టులతో సినిమాలను చేసేవాడు. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ప్రతి సినిమాతో సక్సెస్ ని సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో అతను ముందుకు సాగాడు. అందుకే చాలా మంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూనే తను కూడా దగ్గరుండి మరి కథ విషయంలో గాని మేకింగ్ విషయంలో కానీ అన్ని రకాలుగా తనే చూసుకునేవాడు. దానివల్ల ఎక్కడా మిస్టేక్ జరిగేది కాదు. ఇక దిల్ రాజు అతని ఫ్రెండు ఆయన గిరి ఇద్దరు కలిసి డిస్ట్రిబ్యూటర్లుగా తమ కెరియర్ ని మొదలుపెట్టారు.
ఆ తర్వాత దిల్ రాజు ప్రొడ్యూసర్ గా మారి దిల్, ఆర్య, భద్ర లాంటి సినిమాలను చేశాడు. గిరి మాత్రం సై, ఆంధ్రావాలా లాంటి సినిమాలను చేశాడు. ‘సై’ సినిమా సక్సెస్ అయిన కూడా అతనికి లాభాలైతే రాలేదు. ‘ఆంధ్రవాలా’ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో అతను భారీ గా నష్టపోయాడు.
ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తోనే ‘నా అల్లుడు’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అతనికి కోలుకోలేని దెబ్బ తగిలింది. దెబ్బకి ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోయాడు. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు గిరి తో కలిసి మెరిసి ఉన్నాడు. తను స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత తన ఫ్రెండ్ ని పట్టించుకోలేదు.
దిల్ రాజు ఎప్పుడు లాభాల బాట పడుతూ ముందుకు దూసుకెళ్లాడు తప్ప తన ఫ్రెండుని వెనక్కి పిలిచి అతన్ని కూడా టాప్ ప్రొడ్యూసర్ గా చేయించగలిగితే బాగుండేది కదా అని మరి కొంతమంది దిల్ రాజు మీద ఫైర్ అవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం దిల్ రాజు టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతుండటం విశేషం…